English | Telugu

నాకు నాలుగైదు సార్లు పెళ్ల‌యింది!

యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ తెలుసు. ఇటీవల ఒక షోలో అత‌ని గురించి నటి ఆమని మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది. అత‌ను బుల్లితెర మీద టాప్‌ యాంకర్ల‌లో ఒక‌డిగా రాణిస్తున్నాడు. ప్రదీప్ పెళ్లి విషయంపై షోస్ లో అప్పుడప్పుడు పంచులు కూడా పేలుతుంటాయి. ఇక ఇప్పుడు తాను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు ప్రకటించుకున్నాడు ప్ర‌దీప్‌! అవును.

ఏ ప్రోగ్రాం ఐనా సరే అక్కడ ప్రదీప్ మాచిరాజు కచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు కూడా దసరా సందర్భంగా జీ తెలుగులో "రారండోయ్ పండగ చేద్దాం" పేరుతో ఒక ఈవెంట్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇందులో కూడా త‌ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో "బంగార్రాజు మీట్స్ మాచిరాజు" పేరుతో ఒక కాన్సెప్ట్ లో ప్రదీప్ డబుల్ యాక్షన్ చేశాడు. "వెల్కమ్ రాజు" అని, "థ్యాంక్యూ రాజు గారు" అంటూ తనని తానే వెల్కమ్ చేసుకున్నాడు ప్రదీప్.

ఇక ఎదురెదురుగా కూర్చుని తనని తానే ఇంటర్వ్యూ చేసుకున్నాడు. బంగార్రాజు "మీరు రెగ్యులర్ గా వాడే ఊతపదం ఏంటి?" అని మాచిరాజుని అడగ్గా, "నీ యంకమ్మ" అని సమాధానమిచ్చాడు. తర్వాత "మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా?" అని ఇంకో ప్రశ్న వేసేసరికి "నాలుగైదుసార్లు అయిపోయింది. నిజం, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు" అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. తర్వాత ‘ఆ పెళ్లి కూతురు ఎవరయ్యా ?’ అని అడుగుతూ కామెడీ చేశాడు ప్రదీప్. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.