English | Telugu
వాళ్లు విడిపోవడానికి నేను కారణం కాదంటోంది!
Updated : Jan 3, 2022
బిగ్‌బాస్ సీజన్‌లో సిరి, షన్నుజంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు హౌస్‌లోకి ప్రవేశించి అతి అవుతోందని హెచ్చరించినా.. సిరి తల్లి ఏకంగా హగ్గులు మితిమీరిపోతున్నాయంటూ డైరెక్ట్ గానే పెదవి విరిచినా షన్ను, సిరిజంట పెడ చెవిన పెట్టారు. బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్ వరకు హగ్గులతో హౌస్‌లో చేయాల్సినంత రచ్చ చేశారు. దీంతో ఇద్దరి మీద ప్రేక్షకులకు విసుగు పుట్టిన విషయం తెలిపిందే. ఆ తరువాత టైటిల్ రేసులో ముందుంటాడని భావించిన షన్ను చివరికి రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది.
అంతే కాకుండా హౌస్‌లో సిరి, షన్నుల అతి నెటిజన్ లకు వెగటు పుట్టిస్తే షన్నుని ప్రేమించిన దీప్తి సునయనకు బ్రేకప్ చెప్పాలనేలా చేసింది. ఇటీవల దీప్తి సునయన తను షన్నుకి బ్రేకప్ చెప్పేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చింది. దీంతో షన్నుఅభిమానులతో పాటు దీప్తి అభిమానులు షాక్ కు గురయ్యారు. బిగ్ బాస్ సీజన్ పూర్తయిన దగ్గరి నుంచి షన్నుకి దీప్తి బ్రేకప్ చెప్పడం ఖాయం అంటూ వరుసగా వార్తలు వినిపించడం మొదలైంది. చివరకు అదే ప్రచారాన్ని దీప్తి నిజం చేస్తూ షన్నుకి బ్రేకప్ చెప్పేసి షాకిచ్చింది.
దీన్ని ఊహించిన షన్ను ఇప్పటికైనా దీప్తి హ్యాపీగా వుంటే చాలని, తనని తాను తెలుసుకునే సమయం వచ్చిందని ప్రకటించాడు. దీంతో అందిరి చూపు ఇప్పడు సిరి వైపు మళ్లింది. దీప్తి, షన్నులు విడిపోవడానికి ప్రధాన కారణం సిరి అంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. సిరి, షన్నుతో బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఓవరాక్షన్ కారణంగానే షన్నుతో దీప్తి విడిపోయిందని సిరిని నిందించడం మొదలుపెట్టారు. మళ్లీ నెట్టింట విలన్ గా మారిన సిరి ... దీప్తి, షన్నులవిడిపోవడానికి తాను కారణం కాదని, వ్యక్తిగత కారణాల వల్లే వారు విడిపోయారని సన్నిహితుల వద్ద సర్ది చెప్పుకుంటోందట. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుందో చూడాలి.