English | Telugu
బర్త్‌డే వేళ భార్యకు యాంకర్ రవి సర్‌ప్రైజ్
Updated : Jan 3, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 రియాలిటీ షో ముగిసింది. విజేతగా వీజే సన్నీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ హాట్ ఫేవరేట్ గా హౌస్‌లోకి ప్రవేశించిన యాంకర్ రవి అనూహ్యంగా మధ్యలోనే ఎలిమినేట్ కావడం తనతో పాటు అందరినీ షాక్ గురిచేసింది. ఈ నేపథ్యంలో అతనిపై, అతని ఫ్యామిలీపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ నడిచింది. దీనిపై ఆగ్రహించిన రవి పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. తన పాపతో పాటు తన భార్యని కూడా దారుణంగా ట్రోల్ చేశారని యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇద్దరు కూడా వార్తల్లో నిలిచారు.
యాంకర్ రవికి, అతని ఫ్యామిలీకి ఈ ఎంటైర్ ఎపిసోడ్ వల్ల భారీ పబ్లిసిటీ లభించింది. ఇదిలా వుంటే యాంకర్ రవి తన భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల తన భార్య నిత్య బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరిపించాడు. ఈ సందర్భంగా నిత్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన భార్య పుట్టిన రోజు వేడుకల్లో తన ఫ్రెండ్స్ వర్షిణి, యానీ మాస్టర్ ల చేత స్పెషల్ గా డ్యాన్స్ చేసించి నిత్యకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఈ బర్త్ డే పార్టీలో లో యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్ స్టెప్పులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
`పటాస్` షో లో యాంకర్ రవి, వర్షిణి కలిసి హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ అనుబంధం మళ్లీ ఇద్దరి మధ్య చిగురిస్తోందని, ఆ కారణంగానే వర్షిణి తాజాగా నిత్య బర్త్ డే పార్టీలో డ్యాన్స్ తో హల్ చల్ చేసిందని అంటున్నారు. పటాస్ షోతో యాంకర్ రవి, వర్షిణి బంధం బలపడిన సంగతి తెలిసిందే. నిత్య బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు,. వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.