Read more!

English | Telugu

మీరు చాలా స్మార్ట్ గా, హ్యాండ్సంగా ఉన్నారు.. ఐనా మీరు పెద్ద కసి కదా

ఢీ ప్రీమియర్ లీగ్ ప్రతీ వారం అదరగొట్టేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హైదరాబాద్ ఉస్తాద్స్ వెర్సెస్ సైరా రాయలసీమ గ్రూప్స్ మధ్య అద్భుతమైన పోటీ జరిగింది. ఇక వీళ్ళు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇందులో జడ్జ్ పూర్ణ కూడా డాన్స్ చేసింది. ప్రతీ షోలో జడ్జెస్ ని పొగిడే కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు.. ఈ షోలో కూడా భూమిక అనే అమ్మాయి ఉంది. 

గత ఎపిసోడ్స్ లో శేఖర్ మాష్టర్ ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫిదా ఇపోయారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో భూమిక శేఖర్ మాష్టర్ ని పొగిడే ఛాన్స్ తీసేసుకుంది. "సర్ చెప్పాలంటే మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు, చాలా హ్యాండ్సంగా ఉన్నారు" అని పొగిడేసింది. ఇక ఈ పొగడ్తల తర్వాత శేఖర్ మాష్టర్ స్టేజ్ మీదకు వచ్చారు .."గీత గోవిందం" మూవీలో "ఏంటిఏంటిఏంటి ప్రేమవరస" అనే సాంగ్ కి భూమిక, శేఖర్ మాష్టర్ ఇద్దరు డాన్స్ చేశారు. 

తర్వాత హైపర్ ఆది నాటీ నరేష్ వచ్చారు..ఆది రోబో మూవీలో వసి రోల్ చేస్తే నరేష్ రోబో రోల్ చేసాడు. రావడమే "వసి" అని ఆది చెప్పేసరికి .."ఐనా మీరు పెద్ద కసి కదా" అన్నాడు ప్రదీప్ దానికి ఆది నవ్వేసి "నేను కనిపెట్టిన రోబో ఇదే...వీడే నా చిట్టి...అతను డాన్స్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు..కానీ అది చేయలేడు" అంటూ ఆది చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో దీపికా పిల్లి వచ్చి "నీకు మా మావయ్య గురించి తెలీదు" అనేసరికి వెనక నుంచి కత్తి పట్టుకుని వైట్ డ్రెస్ లో పృథ్వి వచ్చారు. "మా అమ్మాయి మీద ఎవరైనా కన్నేసినా, చెయ్యేసినా, కాలేసినా" అన్ని తీసేస్తా అంటూ డైలాగ్ చెప్పేసరికి "ఐతే ఇక మా వాడి పరిస్థితి అంతే" అంటూ ప్రదీప్ ఆదిని చూసి నవ్వాడు. ఇక తర్వాత ఓరుగల్లు వీరులు వెర్సెస్ నెల్లూరి నెరజాణలు మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది.