English | Telugu
నేను ఇన్ని తొడలు కొడితే ...నువ్వెళ్ళి అడుక్కుంటావేంటే
Updated : Mar 7, 2025
ఢీ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్ ఏంటంటే "మాష్టర్ విత్ కంటెస్టెంట్ రౌండ్ 2 .0 " ఇందులో మాష్టర్లు అంతా కూడా తమ తమ కంటెస్టెంట్స్ తో డాన్స్ చేసి ఇరగదీసాడు. ఇక సుదర్శన్ మాష్టర్ ఐతే బాలయ్య సాంగ్ "దబిడి..దిబిడే" అనేదానికి అదరగొట్టాడు. ఇక ఆది ఐతే బాలయ్య రేంజ్ లో ఓకే డైలాగ్ చెప్పాడు. "ఢీ షో ఐనా శ్రీదేవి డ్రామా కంపెనీ ఐనా జబర్దస్త్ ఐనా, ఈవెంట్ ఐనా ఒన్స్ ఐ స్టెప్ ఇన్ 15 స్టార్లు రిపీట్ " అన్నాడు. ఇంతలో పక్కనుంచి అశ్విని తన చీర చెంగు చాపి సోనియా వాళ్ళ దగ్గర వెళ్ళింది.
"ఏమే ముష్టి నేను ఇన్ని తొడలు కొడితే నువ్వెళ్ళి అడుక్కుంటావేంటే... అన్నాడు ఆది. ఇందులో ఆది- అశ్విని, సోనియా - సిద్దు మధ్య పెర్ఫార్మెన్సెస్ తో ఒక వార్ నడుస్తోంది. స్టార్స్ ఇంతవరకు సోనియా వాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆది కూడా తన కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఎలాగైనా ఇంకా ఎక్కువగా స్టార్స్ సంపాదించాలని చూస్తున్నాడు. తర్వాత ఇంకో పెర్ఫార్మెన్స్ లో తండ్రి లేని లోటును వివరిస్తూ చేసిన డాన్స్ కి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందులో జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోని చూపించారు. దాంతో విజయ్ బిన్నీ ఎన్ని జన్మలకైనా తనకు తన తండ్రే కావాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రోమో లాస్ట్ లో వర్షిణి, జాను లూరి ఈ ఇద్దరూ స్పెషల్ పెర్ఫార్మెన్సెస్ తో రాబోతున్నారు. ఇలా మల్టి డ్యాన్సింగ్ స్టార్స్ తో నెక్స్ట్ వీక్ ఈ షో అలరించబోతోంది.