English | Telugu
నేను జబర్దస్త్ షోకి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా!?
Updated : Sep 10, 2022
జబర్దస్త్ షో లోంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ షోకి తిరిగి వస్తూ ఉండడం నిజంగా గొప్ప విషయం. వెళ్లిపోయిన గెటప్ శీను తిరిగొచ్చాడు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా వచ్చేసాడు. ఇప్పుడు రిలీజ్ ఐన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆది ఇందులో ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో దణ్ణాలు పెట్టుకుంటూ వచ్చాడు.
"అసలు నేను జబర్దస్త్ కి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా అనే విషయం ఒక్కసారి నాకు అర్ధం కాలేదు" అనేసరికి అందరూ గట్టిగా అరిచారు. "నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏంచేయాలి అని ఆది రష్మిని అడిగేసరికి నా వెనకాల చానాలు తిరగాలి తెలుగు అచ్చుతప్పు చెప్పేసరికి ..చానాలు తిరగాలా ఇది తెలియక మన గాలోడు (సుడిగాలి సుధీర్) ఛానళ్లన్నీ తిరిగేస్తున్నాడుగా" అనేసరికి రష్మీ సిగ్గుపడిపోయింది. తర్వాత రాకెట్ రాఘవ మురారి ఇద్దరూ కలిసి అత్తిలి సత్తి గెటప్స్ లో వచ్చి ఎంటర్టైన్ చేశారు. "రాకెట్ రాఘవ ఇక్కడ నేనొస్తే మినిమం ఉంటది అనేసరికి నేనొస్తే మిలియన్స్ లో ఉంటది" అని కౌంటర్ ఇచ్చాడు మురారి. "ఏంట్రా అత్తిలి సత్తిబాబుని వస్తే అనుష్క జింతాతా జిత అనట్లేదు అంటాడు. నిన్ను ముత్తాత అంటారు కానీ జింతాత అని ఎందుకు అంటారు" అనేసరికి రాఘవ సైలెంట్ ఐపోయాడు. తర్వాత బంగారం పాప వచ్చి చలాకి చంటితో స్కిట్ వేస్తుంది. ఇలా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.