Read more!

English | Telugu

ఎంటర్టైన్మెంట్, ఎనెర్జీ అనే పదాలకు రూపముంటే దాని పేరే రవితేజ!

ఢీ-14 గ్రాండ్ ఫినాలేకి మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేశారు. ఇక రవితేజ గురించి హైపర్ ఆది ఒక రేంజ్ లో చెప్పి ఔరా అనిపించుకున్నాడు. " మీ  కెరీర్ స్టార్టింగ్ లో ఆ చేతులు అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టాయి. ఇప్పుడు మీ కెరీర్ చూసి మా చేతులు క్లాప్స్ కొడుతున్నాయి, కొడుతూనే ఉంటాయి. అల్లరి ప్రియుడు మూవీలో హీరోకి ఎక్కడో బాక్గ్రౌండ్ లో ఉన్నారు. 

తర్వాత ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చారు. కాలేజీ ఎగ్గొట్టి వేరే వాళ్ళ సినిమాకు మీరు వెళ్లే స్థాయి నుంచి మేము కాలేజీ ఎగ్గొట్టి మీ సినిమా చూసే స్థాయి వరకు మీ జర్నీ సూపర్.  హీరో ఐన పదేళ్లకు మీకు కిక్కు వస్తే మాకు మీరు హీరో ఐనప్పుడే కిక్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ , ఎనెర్జీ అనే పదాలకు రూపం ఉంటే ఆ రూపానికి కచ్చితంగా రవితేజా అనే పేరే పెడతాను. ఇండస్ట్రీ ప్రతీ హీరోకి వేరే హీరో కాంపిటీషన్ ఉంటారు. కానీ మీకు మీరే కాంపిటీషన్. ఎందుకంటే రవితేజ అన్న పేరులో రన్నర్ మీరే, విన్నర్ మీరే..ఇండస్ట్రీ మొత్తం రాజా ది గ్రేట్ అంటుందేమో మాలాంటి ఫాన్స్ అంతా మాత్రం రవితేజ ది గ్రేట్ అంటాము. మీ సినిమా చూసేటప్పుడు మా మూతి మీద చిరునవ్వు ఉంటది, సినిమా చూసి బయటికి వచ్చాక మా చెయ్యి మా మీసం మీద ఉంటది. వెంకీ, దుబాయ్ శీను మీకు బ్లాక్ బస్టర్స్ ఐతే మాకు స్ట్రెస్ బస్టర్స్..మీరు ఎంత డబ్బు సంపాదించారో తెలీదు కానీ ఇప్పటికీ మీమర్స్ వాటిని క్రియేట్ చేసుకుని కాష్ చేసుకుంటున్నారు. ఇంకా వెనకే ఉండి డాన్స్ చేస్తున్నాం  అని ఫీల్ అవుతున్న వారందరికీ ఒకటే చెప్తున్నా కర్తవ్యం మూవీలో రవితేజ గారు కనబడపడకుండా వెనకే ఉండేవారు. 

తర్వాత కష్టపడి పనిచేసి ఇలా మాస్ మహారాజ రవితేజ అయ్యారు. ఆయన గురించి చెప్పాలంటే అవతల వాడిని  నమ్ముకుంటే ఆరిపోతాయి, పక్కవాడిని నమ్ముకుంటే పారిపోతావ్, ముందు వాడిని నమ్ముకుంటే మునిగిపోతావు, వెనకవాడిని నమ్ముకుంటే వెనక్కి పోతావ్..మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆయన సిద్ధాంతం. ఆయనకు సలహాలు ఇచ్చే అలవాటు లేదు, తీసుకునే అవసరం కూడా లేదు..అందుకే ఇండస్ట్రీలో ఆయనకు తిరుగు లేదు..." అని రవితేజ గురించి ఆయన చరిత్ర మొత్తం ఆది స్టేజి మీద చెప్పుకొచ్చాడు.