English | Telugu

అరె ఛీ.. ఏంట్రా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు!

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి అంతూ పొంతూ లేకుండా పోయింది. బుల్లితెర షోస్ లో ఇలాంటి డైలాగ్స్ ఉంటేనే షోకి రేటింగ్ పెరుగుతుంది అని వాటినే ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టూ మచ్ డైలాగ్స్ తో ఆడవాళ్లు తల దించుకునే స్థాయికి తీసుకెళ్లారు. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో "నా కొడుకు" టైటిల్ తో ఒక ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు గెస్టుగా సీనియ‌ర్ క‌మెడియ‌న్‌ కృష్ణభగవాన్ వచ్చాడు. 'ఎఫ్‌3' మూవీ కాన్సెప్ట్ ప్రకారం తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తర్వాత ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని కృష్ణ భగవాన్ చెప్పడంతో మరో స్కిట్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్.

ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికల వ్యాపారం చేస్తుంటాడు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు అమ్ముతూ ఉంటాడు. రాంప్రసాద్ కూరగాయల బిజినెస్ చేస్తుంటాడు. వీళ్ళ బిజినెస్ ని చూసి కొనడానికి నాటీ నరేష్ వచ్చి తన పరువు తానే తీసేసుకుని అందరినీ తలదించుకునేలా చేస్తాడు. రాంప్రసాద్ కూరగాయల దగ్గరకు వచ్చి "దొండకాయను చూపించిఏంటి ఇది ఇంతే ఉంది?" అంటూ డబుల్ మీనింగ్‌లో అంటాడు. "ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా?" అని నరేష్ ని ఇంకా రెచ్చగొడతాడు రాం ప్రసాద్. వీళ్ళ డైలాగ్స్ వినలేక ఇంద్రజ సిగ్గుతో తలదించుకుంటుంది. చివరికి పంచ్ ప్రసాద్ వచ్చి అందరినీ తిడతాడు.

ఏదో చేద్దామని అనుకుని కానీ ఏమీ చేయలేక తెల్ల ముఖాలు వేసుకుని నిలబడ్డారు. నరేష్ స్పాంటేనిటీగా ఏదో చేద్దామని వచ్చి ఏది చేయలేక ఉన్న పరువు, లేని పరువు, అప్పు చేసిన పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ఈ స్కిట్ అయ్యిందనిపించారు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.