English | Telugu

హిమకి నిజం చెప్పేసిన మోనిత!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగుతూ ఎపిసోడ్-1565 లోకి అడుగుపెట్టింది. సౌందర్యకి నిజం తెలిసిందేమోనని దీపకి అనుమానం కలుగుతుంది. "దీప నువ్వు వంటగదిలోకి రాకు.. ఏదీ కావాలన్నా నేను వండిపెడతాను" అని సౌందర్య చెప్పడంతో దీపకి ఉన్న అనుమానం మరింత రెట్టింపు అవుతుంది. ఇక సౌందర్య ఒంటరిగా ఉండటం చూసి తననే డైరెక్ట్ గా "అత్తయ్య మీకు నిజం తెలిసిపోయింది కదా?" అని అడిగేస్తుంది. "ఏం నిజం? నాకేం తెలియదు" అని సౌందర్య చెప్తుంది. " అత్తయ్య మీకు మీ కొడుకు లాగే నటించడం రాదు" అని దీప అంటుంది. "ఎందుకు దీప మనల్ని ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడెందుకు?" అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది సౌందర్య. దీప మాట్లాడుతూ "నేను చనిపోయాక కార్తిక్ కి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేయండి. నా పిల్లలు తల్లి లేకుండా పెరగకూడదు" అని సౌందర్యతో చెప్తుంది.

మోనిత పెట్టిన చిచ్చు కారణంగా హిమ నిద్రకూడా పోకుండా రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు హిమ డైరెక్ట్ గా మోనిత దగ్గరకి వెళ్తుంది. అక్కడ మోనిత "మీ అమ్మ ఎక్కువ రోజులు బ్రతకదు. అందుకే ఇన్ని రోజులుగా కన్పించకుండా మీ అమ్మనాన్న ఇద్దరూ తిరిగారు" అని చెప్తుంది. "ప్లీజ్ ఆంటీ అలా అనకండి" అని హిమ ఏడుస్తూ అంటుంది. "నేను ఒక్కదానినే ఈ ప్రపంచంలో మీ అమ్మ ప్రాణాలు కాపాడేది. కానీ మీ డాడీ వినట్లేదు. ఆంటీ చెప్పినట్లు చెయ్యమని నువ్వు అయినా మీ డాడీకి చెప్పు" అని మోనిత అంటుంది. "మీరు ఎంత మంచి వారు ఆంటీ. మా అమ్మ కోసం ఆలోచిస్తున్నారు. ఎలాగైనా మా డాడీని మీరు చెప్పింది చెయ్యమని చెప్తాను" అని హిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

శౌర్య, కార్తిక్, దీపలు గుడికి వెళ్తారు. అక్కడ కార్తిక్, శౌర్య మాట్లాడుకుంటారు. "ఇన్ని రోజులు మీరెందుకు మాకు దూరంగా ఉన్నారు నాన్న" అని శౌర్య అడుగుతుంది. "అదేం లేదమ్మా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేశాను కదా.. ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను" అని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.