English | Telugu
'బ్రహ్మముడి' సీరియల్ కి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ప్రమోషన్స్!
Updated : Jan 18, 2023
కార్తీకదీపం సీరియల్ త్వరలో ముగియబోతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ టైం స్లాట్ లో జనవరి 24వ తేదీ నుంచి ‘బ్రహ్మముడి’ అనే పేరుతో కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ఎలా ఒక్కటి కాబోతున్నారనే కథాంశంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఆల్రెడీ ఈ సీరియల్ ని డాక్టర్ బాబు, వంటలక్క ప్రమోట్ చేస్తున్నారు.
ఐతే ఈ కొత్త సీరియల్ ప్రమోషన్ కోసం బాలీవుడ్ బాదుషాహ్ రంగంలోకి దిగారు. సీరియల్ హీరోయిన్ కావ్య గురించి ప్రోమోలో చాలా చక్కగా చెప్పారు. ఆడపిల్ల అయినా కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆర్టిస్ట్ ఐనా సరే ఎంతో బాధ్యత కలిగిన అమ్మాయి అంటూ కావ్య గురించి చెప్పుకొచ్చారు షారుఖ్. ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 కి ప్రసారం కాబోతుంది ఈ సీరియల్. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఐతే ఈ సీరియల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తమిళ బుల్లితెర నటి దీపికా రంగరాజు ఈ సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతోంది. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు హీరో. అంతేకాదు వాళ్ళ స్టేటస్ కూడా చూసే వ్యక్తిగా రాజ్ మనస్తత్వం ఉంటుంది.
ఇక తాను చేసే పనిలో సంతోషం, సంతృప్తిని వెతుక్కుంటూ సర్దుకుపోయే క్యారెక్టర్ లో హీరోయిన్ కనిపిస్తుంది. అలాగే తన చెల్లెళ్లకి మంచి భవిష్యత్ అందించాలని తాపత్రయ పడే అమ్మాయిగా కావ్య కనిపిస్తుంది. వీళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉన్న ఈ జంట ఎలా ఒక్కటి కాబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజుల్లో ప్రసారం కాబోయే సీరియల్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇక మరో విషయం ఏమిటి అంటే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి ఫ్రెండ్ గా చేసిన గౌతమ్ అలియాస్ కిరణ్ కాంత్ ఈ సీరియల్ లో మరొక హీరోగా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ ఐన హమీదా హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి ఈ సీరియల్ రీమేక్. ఈ టైం స్లాట్ లో ప్రసారమైన కార్తీకదీపం ఎలా హిట్ కొట్టిందో అందరికీ తెలిసిన విషయమే.. మరి ఇప్పుడు అదే టైంకి రాబోతున్న బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉండబోతోందో చూడాలి.