English | Telugu

మోనాల్‌కి అఖిల్ పెట్టుకున్న‌ ముద్దు పేరు ఇదే!

బిగ్ బాస్ సీజన్ 34 లో కంటెస్టెంట్ లుగా పాల్గొన్న మోనాల్-అఖిల్ ఎంతో స్నేహంగా మెలిగారు. మొదట్లో అభిజిత్‌తో క్లోజ్‌గా ఉండే మోనాల్ ఆ తరువాత అఖిల్‌కి దగ్గరైంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అలగడాలు, బుజ్జగించుకోవడాలు సీజన్‌కి హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్‌లో ఎక్కువ భాగం వీరి గురించే ప్రసారం చేసివారు. హౌస్ నుండి బయటకు వచ్చేసిన తరువాత కూడా ఈ జంట తమ స్నేహాన్ని కొనసాగిస్తోంది.

తరచూ వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు. దీంతో నిజంగానే వాళ్ల మధ్య ఏదో ఉందనే టాక్ నడుస్తోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. తాజాగా వీరిద్దరూ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. మోనాల్ ను 'గుజ్జు' అంటూ సంబోధించాడు. దీనికి మోనాల్ కూడా 'అఖిలూ' అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'తెలుగు అబ్బాయి గుజ‌రాత్ అమ్మాయి' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...