English | Telugu

'కామెడీ స్టార్స్‌' షోపై సద్దాం సెటైర్లు!

ప్రస్తుతం బుల్లితెరపై మీద ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి పాపులారిటీ ఏర్పడింది. రవి, లాస్య, వర్షిణి, అవినాష్, శేఖర్ మాస్టర్ లాంటి వారితో షోని బాగానే నెట్టుకొస్తున్నారు. అయితే ఇదే షోలో 'అదిరింది' బ్యాచ్ కూడా దూసుకుపోతోంది. 'పటాస్' నుండి 'అదిరింది' షోకి షిఫ్ట్ అయిన 'గల్లీ బాయ్స్' మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే ఆ షో ఆగిపోవడంతో వారంతా 'కామెడీ స్టార్స్'లోకి వచ్చి చేరారు.

తాజాగా సద్దాం వేసిన స్కిట్.. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. యమలోకంలోకి వెళ్లిన సద్దాం.. భూలోకంలో తాను పడిన బాధల గురించి యముడికి చెబుతూ 'ఎంత పెద్ద శిక్ష వేశారు?' అంటూ ప్రశ్నిస్తుంటాడు. ఈ క్రమంలో తనదైన స్టైల్ లో పంచ్ లు వేశాడు. పనిలో పనిగా జడ్జ్ లు శేఖర్ మాస్టర్, శ్రీదేవిలను కూడా టార్గెట్ చేశాడు. ఎంకరేజ్ చేయడానికైనా పదికి పది మార్కులు ఇవ్వరని.. ఎంత బాగా చేసినా తొమ్మిది మార్కులే ఇస్తుంటారని అన్నాడు.

అలానే 'కామెడీ షో' నిర్వాహకులపై సెటైర్లు వేశాడు. మాములుగా అయితే స్కిట్ కోసం గంట ముందు మాత్రమే ప్రిపేర్ అవుతానని.. అలాంటిది రెండు రోజుల ముందు నుండే ప్రాపర్టీస్ చెప్పమని నిర్వాహకులు అడుగుతున్నారని అన్నాడు. వాళ్లిచ్చిన ప్రాపర్టీస్‌తో స్కిట్ డిజైన్ చేసుకోవాల్సి వస్తోందంటూ కౌంటర్ వేశాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...