English | Telugu

యూట్యూబ్ ట్రెండింగ్ లో గుప్పెడంత మనసు సీరియల్!

కొన్ని ధారావాహికలు ప్రేక్షకులని డిస్సాపాయింట్ చేస్తాయి. మరికొన్ని విపరీతంగా నవ్చేస్తాయి. అలా విపరీతంగా నచ్చే కేటగిరీలో ఉన్న సీరియల్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది.

తాజాగా కార్తీకదీపం-2 మొదలైన సంగతి అందరికి తెలిసిందే‌. అయితే దానికి ఇంకా పూర్వ వైభవం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా టీఆర్పీలో అగ్రస్థానంలోకి రాలేకపోతుంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి కారణం రిషి. మొన్నటి ఎపిసోడ్ లో వారం రోజుల్లో రిషి సర్ ని తీసుకొస్తానని దేవయానితో వసుధార ఛాలెంజ్ విసరడం.. అదే రోజున రిషి ఆటోవాలా గెటప్ లో వసుంధరతో కనపడటం చూసిన ఆడియన్స్ ఇక రిషి వచ్చేస్తున్నాడని అనుకుంటున్నారు. అందుకే ఎప్పుడెప్పుడు రిషి సర్ వస్తారా.. వసుధార-రిషిల ప్రేమకథని చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రిషి, వసుధారల కోసం మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. అది యూట్యూబ్ లో అత్యధిక వీక్షకాధరణ పొందింది.

ఇక ఇప్పుడేమో గుప్పెడంత మనసు సీరియల్ ప్రోమో అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మహేంద్ర, వసుధార మాట్లాడుకుంటారు. మనం వెతుకుతున్నాం కానీ కనపడట్లేదు రిషి సర్ అయిన రావాలి కదా.. అందరు ఏవేవో మాట్లాడుతున్నారు. రిషి సర్ బ్రతికే ఉన్నాడని చెప్పడానికి నేనే కారణం. ఇక్కడ నా ఊపిరి ఆగిపోతే అప్పుడు నమ్మండి రిషి సర్ లేరని అని వసుధార ఎమోషనల్ అవుతుంది. నీ నమ్మకం నిజమవ్వాలని మహేంద్ర అనగానే.. అది భ్రమ బాబాయ్ అంటూ శైలేంద్ర వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.