English | Telugu
దుగ్గిరాల ఇంటిపరువు తీసిన స్వప్న.. కావ్యకి సపోర్ట్ గా నిలిచిన రాజ్!
Updated : Jul 25, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.. స్వప్న మోడల్ గా తన ఫస్ట్ షూట్ చేస్తుంది. అది పర్ఫ్యూమ్ కి సంబంధించిన ఆడ్. అందులో స్వప్న వేరోక అబ్బాయితో బోల్డ్ గా యాక్ట్ చేస్తుంది. ఈ యాడ్ ఒకసారి బయటకు వెళ్తే మీరు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోతారని డైరెక్టర్ స్వప్న తో చెప్పగానే.. స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి ఇంట్లో తనని స్వప్న అన్న మాటలు చెప్పడంతో అందరు స్వప్నపై కోపంగా ఉంటారు. అప్పుడే స్వప్న కార్ లో, మరొకవైపు కావ్య ఆటోలో ఒకేసారి ఇంటికి వస్తారు. స్వప్న ని ఆ డ్రెస్స్ లో చూసిన కావ్య కోపంగా.. ఏంటి అక్క ఈ డ్రెస్ ఇలా బయటకు వెళ్ళావా? నిన్ను ఇలా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని కావ్య అనగానే.. వెళ్ళాను అయితే ఏంటని చెప్పి స్వప్న లోపలికి వెళ్తుంది. స్వప్నని ఆ డ్రెస్ లో చూసిన దుగ్గిరాల ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు. ఏంటి ఈ అవతారమని అపర్ణ అడుగుతుంది. ఇది ఫ్యాషన్ అని స్వప్న సమాధానం చెప్తుంది. దుగ్గిరాల ఇంటి కోడలు ఎలా ఉండాలో తెలియదా? ఇలా బయటకు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారని ఇందిరాదేవి అనగానే.. బయట గురించి ఇంట్లో ఉండేవాళ్లకు ఎలా తెలుస్తుందని స్వప్న అంటుంది.
నీ గురించి మాకెందుకు గని.. మా ధాన్యలక్ష్మిని ఎందుకు అవమనించావని స్వప్నని అపర్ణ అడుగుతుంది. నన్ను అనేందుకు తనెవరు? అంటే నా భర్తగాని నా అత్త గాని అనాలని స్వప్న అనగానే.. స్వప్నపై కావ్య కోప్పడుతుంది. దాంతో రుద్రాణి మళ్ళీ కావ్య ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. అలా తను మాట్లాడగానే రాజ్ కి కోపం వస్తుంది. తప్పు చేసింది నీ కోడలు.. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు అంటావని రుద్రాణిపై కోప్పడతాడు రాజ్. ఈ కావ్య వాళ్ళ చెల్లెలు కదా? తను ఎలా ఉంది.. స్వప్న ఎలా ఉంది. వీళ్ళ ఇద్దరినీ పక్క పక్కన నిల్చొపెట్టి చూస్తే తెలిసిపోతుంది. దుగ్గిరాల ఇంటి కోడలు ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని రాజ్ అంటాడు. అలా కావ్యకి సపోర్ట్ గా రాజ్ మాట్లాడేసరికి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాహుల్ నీ భార్యని అదుపులో పెట్టుకో అని రాహుల్ కి వార్నింగ్ ఇస్తాడు రాజ్.
మరొకవైపు రాజ్ తనని అర్థం చేసుకుంటున్నాడని దేవునికి తన సంతోషాన్ని చెప్పుకుంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ తో మాట్లాడుతుంది అపర్ణ. ఏంటి ఈ మధ్య నీకు ఆ కావ్యపై ప్రేమ మొదలైందా? ప్రతిదానికి తనని వెనకేసుకొని వస్తున్నావని అపర్ణ అంటుంది. నువ్వు నీ భార్యగా ఒప్పుకున్నా.. నేను ఎప్పటికి తనని కోడలుగా ఒప్పుకోనని అపర్ణ అనగా.. లేదు మమ్మీ సాటి మనిషిని చూస్తున్నా.. ఆ రోజు నాకు ప్రాబ్లమ్ అయితే అంత హెల్ప్ చేసింది. అందుకే నేను సాటి మనిషిగా హెల్ప్ చేస్తున్నాను. నేను ఎప్పటికి భార్యగా ఒప్పుకోనని అపర్ణతో రాజ్ అంటాడు. ఆ మాటలు అన్ని కావ్య విని బాధపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి.. నీకు ఈ రోజు రాజ్ సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.