English | Telugu

ప్రెగ్నెన్సీ కోసం స్వప్న చేసే పని సరైనదేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -185 లో.. కావ్య అందరికీ కాఫీ తోసుకొని వస్తుంది. అయితే ఎవరికిచ్చినా ఎవరూ తీసుకోరు. ఎందుకంటే కావ్యతో ఎవరు మాట్లాడకూడదని అపర్ణ చెప్పింది. దాంతో అందరూ అలానే కావ్యతో మాట్లాడకుండా ఉంటారు. మరొకవైపు రోడ్డు మీద బైక్ వేలం పాట పెడుతుంది అప్పు. కళ్యాణ్ అక్కడికి వచ్చేసరికి అప్పు చుట్టూ జనాలను చూసిన కళ్యాణ్.. ఇక్కడేంటి ఇంతమంది ఉన్నారని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి బైక్ వేలంపాట వేస్తుంటుంది అప్పు.

ఇది నా బైక్ అని కళ్యాణ్ అనగానే.. అది నువ్వు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేముందు ఆలోచించాలని అప్పు అంటుంది. బైక్ విలువ తెలిసినవాడివి నా విలువ తెలియదా.. మా గల్లీలోకి హీరో వచ్చిన హీరోయిన్ వచ్చినా దోస్త్ లతో కలిసి చూడాలనుకుంటాం, నీలాగా ఇలా వదిలేసి వెళ్ళిపోమని కళ్యాణ్ తో అప్పు అనగానే.. సారీ బ్రో వదిలేయ్ అని కళ్యాణ్ అంటాడు. మరి ఏమైంది నీ సువర్ణ సుందరి కథ అని అప్పు అడుగగా.. తను వేరొకరి భార్య అని కళ్యాణ్ అంటాడు. దాంతో అప్పు నవ్వేసి.. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా, తను నీ సుందరి కాదు.. నిన్ను ఆడిస్తుందని, గిప్పుడేమైందని అప్పు అంటుంది. సర్లే అని కళ్యాణ్, అప్పు ఇద్దరు బయల్దేరతారు.
మరొకవైపు కావ్య కిచెన్ లో ఒంటరిగా ఆలోచిస్తుంటుంది. ధాన్యలక్ష్మిని మాట్లాడించాలని ప్రయత్నించిన తను మాట్లాడకుండా ఒక పేపర్ మీద రాస్తుంది. నీతో ఎవరూ మాట్లాడొద్దని అక్క అందరికి చెప్పిందని ధాన్యలక్ష్మి పేపర్ మీద రాసి కావ్యకి ఇస్తుంది. ఆ తర్వాత స్వప్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని తన ఫ్రెండ్ శిరీషకి కాల్ చేసి అడుగగా.. తను అన్నీ చూసి ఇక ఇప్పట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు.. రెండే దార్లున్నాయి. ఒకటి రాహుల్ తో నువ్వు కలవడం, రెండవది ఎలాగైనా కడుపు పెంచుకోవడమని చెప్పేసి శిరీష కాల్ కట్ చేస్తుంది. దాంతో రాహుల్ తో అవ్వదు కానీ ఎలాగైనా బాగా తిని కడుపు పెంచుకోవాలని స్వప్న భావిస్తుంది.

మరొకవైపు వాళ్ళ గదిలోకి కావ్య వెళ్ళగానే రాజ్ ఏదో పెయింటింగ్ వేస్తుంటాడు. అది చూసి ఏంటి కళాపతి ఏం పెయింటింగ్ వేస్తున్నారని అడిగినా రాజ్ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. తను వేసే పెయింటింగ్ కావ్యకి కనిపించకుండా చేస్తాడు. మరొకవైపు ఆఫీస్ లో పనిచేస్తున్న డిజైనర్ కి కావ్య కాల్ చేసి... మీ బాస్ ఏం పెయింటింగ్ వేస్తున్నాడు? ఏంటి అని అడుగుతుంది. అదేంటంటే మొన్న క్లయింట్ కాల్ చేసి, మీరు వేసిన డిజైన్స్ లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయన్నారని కావ్యతో ఆ డిజైనర్ చెప్తుంది. అవునా అందుకేనా మీ బాస్ అంత కష్ట పడుతున్నాడని కావ్య అంటుంది. ఆ తర్వాత రుద్రాణి వచ్చి కావ్య ఒంటరిదని చెప్తుంది. దానికి కావ్య కౌంటర్ వేస్తుంది. నాకు సహనం ఉంది నాతో మాట్లాడితే అత్తయ్య చూస్తే అంతే అని రుద్రాణితో కావ్య అంటుంది. ఆ తర్వాత స్వప్న పొట్ట పెరగాలని బిర్యానీ తెప్పించుకొని తింటుంది‌. అది ధాన్యలక్ష్మి చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.