English | Telugu

Brahmamudi: నేరం ఋజువైంది.. అనామికకి జైలు శిక్ష!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -456 లో.....అనామిక ఇదంతా కావాలని చేస్తుందని కావ్య జడ్జి ముందు చెప్తుంది. అంతే కాకుండా తన దగ్గరకి వెళ్ళినప్పుడు తన మాటలను రికార్డు చేసానని ఆధారాలున్నాయని చెప్తుంది. లాయర్ ఆ రికార్డింగ్ ని జడ్జి కి ఇవ్వగా స్క్రీన్ పై అందరు చూస్తారు. అందులో ఇదంతా ఆస్తి కోసమే చేశానని అనడం అందరు వింటారు. దాంతో అనామిక టెన్షన్ పడుతుంది.ఇన్ని రోజులు నా క్లయింట్ తప్పు చేసాడని ఈ అనామిక నిరూపించే ప్రయత్నం చేసింది కానీ ఇదంతా కావాలని చేసిందని నిరూపణ జరిగిందని లాయర్ అంటాడు.

ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది గనుక అప్పుకి తన కుటుంబానికి పరువు నష్టం అయింది కాబట్టి తనకి నష్టపరిహారంగా లక్ష రూపాయలు అంతే కాకుండా కళ్యాణ్ కుటుంబానికి రెండు లక్షలు నష్టపరిహారం.. కోర్టుని తప్పు దోవ పట్టించినందుకు పదిహేను రోజుల జైలు శిక్ష అని జడ్జి తీర్పు ఇస్తాడు. కళ్యాణ్ పై కేసు కొట్టివేయ్యడం జరిగిందని చెప్పగానే కళ్యాణ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అనామికకి అన్యాయం చేసావంటు కళ్యాణ్ ని రాజ్ అవమానించిన వాళ్ళు.. వాళ్ళ కుటుంబానికి సారీ చెప్తారు. అనామికని తిడుతారు అనామికని పోలీసులు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కావ్యకి ప్రకాష్, కళ్యాణ్ లు థాంక్స్ చెప్తారు. మరొకవైపు కనకం, అప్పు, కృష్ణమూర్తి లు ఇంటికి రాగానే చుట్టుపక్కన వాళ్ళు వచ్చి.. ఏంటి కోర్టులో ఆ కళ్యాణ్ , అప్పుల సంబంధం నిజమే అని తేలిందా అని అడుగుతారు. ఆ అనామిక ఆస్తి కోసం ఇదంతా చేసిందని రుజువు అయింది. ఇలా ఇంకొకసారి మాట్లాడకండంటూ వాళ్ళకి కనకం బుద్ది చెప్పి పంపిస్తుంది. మరొక వైపు కావ్య వర్క్ చేస్తుంటే రాజ్ తనని చూస్తుంటాడు. తన దగ్గరకి వెళ్లి ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అయినట్టు ఉహించుకుంటాడు. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది.

ఏంటి కావ్యని ఏం చేసినట్టు ఉహించుకుంటున్నావని అడుగుతుంది. అదేం లేదు నానమ్మ అంటూ రాజ్ తడబడతాడు. కావ్య వస్తుంది సైలెంట్ గా ఉండమని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటని అడుగుతుంది. నేను అబద్దం చెప్పలేనంటూ ఇందిరాదేవి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పకుండా ఆపారు కానీ మీ మనసుని ఆపలేరు కదా అంటు రాజ్ బుగ్గ పై గిల్లి వెళ్తుంది కావ్య. తరువాయి భాగంలో అనామికపై కళ్యాణ్ కోపంగా తన ఫోటోస్ అన్నీ కాల్చేస్తాడు. అదంతా కావ్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.