English | Telugu
మీ పెళ్ళెప్పుడని అడిగిన వసుధార.. షాక్ లో రిషి!
Updated : Aug 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -847 లో.. వసుధార డల్ గా ఉండడంతో ఏం జరిగి ఉంటుందని తెలుసుకోవడానికి చక్రపాణి దగ్గరికి రిషి వెళ్తుంటే.. అతనే దార్లో కన్పిస్తాడు. దాంతో ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా అని చక్రపాణిని రిషి అడుగుతాడు. అదేం లేదని చక్రపాణి అంటాడు.
ఆ తర్వాత మరి ఎందుకు మీ కూతురు డల్ గా ఉంది. ఏం జరిగిందని రిషి అడుగుతాడు. ఏం ఉంటుంది మీ గురించే అని చక్రపాణి చెప్తాడు. కాసేపటికి రిషి వెళ్లబోతుంటే.. ప్రొద్దున మా ఇంటికి ఏంజిల్ వచ్చింది. నేను పని మీద బయటకు వచ్చాను. వాళ్ళేం మాట్లాడుకున్నది నేను వినలేదని చక్రపాణి చెప్తాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏంజిల్ దగ్గరికి వెళ్తాడు. వసుధారని కలిసి ఏం మాట్లాడవని ఏంజిల్ ని అడుగుతాడు రిషి. వసుధార చెప్పేసిందా ఏంటని ఏంజిల్ టెన్షన్ పడుతుంది. ఎందుకు వసుధార ఏమైనా చెప్పిందా అని ఏంజెల్ అడగగానే.. ఆమె చెప్పలేదు అనే కదా నిన్ను అడిగేదని రిషి అంటాడు. ఈ రోజు వసుధార మేడమ్ ఎందుకు డల్ గా ఉన్నారని రిషి అంటాడు. తను డల్ గా ఉంటే నన్ను అంటావ్ ఏంటి.. నేను మాట్లాడిన దానికి తన డల్ గా ఉండడానికి సంబంధమేంటి? తన పర్సనల్ తనది అని ఏంజిల్ అంటుంది. మేరేం మాట్లాడుకున్నారో చెప్పమని ఏంజెల్ ని అడిగినా.. తను సమాధానం చెప్పదు. ఆ తర్వాత రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొక వైపు రిషి కలిసిన విషయం వసుధారకి చెప్పాలా వద్దా అని చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార దగ్గరికి చక్రపాణి వెళ్లి.. రిషి కలిసి మాట్లాడిన విషయం చెప్తాడు. భోజనం చేద్దాం వసుధార అని చక్రపాణి పిలిచిన వసుధార వెళ్ళదు.
ఆ తర్వాత ఏంజిల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ వసుధార ఎమోషనల్ అవుతుంది.. ఇన్ని రోజులు మా మధ్య తాత్కాలిక దూరం ఉందనుకున్న కానీ మా మధ్య మూడవ వ్యక్తి వచ్చింది. ఎక్కడ ఏంజిల్ ప్రేమని రిషి అంగీకారిస్తాడో అని వసుధార బయపడుతుంది. మరొకవైపు ఎవరిని అడిగిన ఏం జరిగిందో చెప్పట్లేదని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి. ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నారని రిషి మెసేజ్ చెయ్యగానే.. అది నా పర్సనల్ మన మధ్య ఏ బంధం లేనప్పుడు మీకు ఎందుకు చెప్పాలని వసుధార రిప్లై ఇస్తుంది. కొద్దిసేపు ఇద్దరు చాట్ చేసుకున్నాక.. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడని వసుధార మెసేజ్ చెయ్యగానే.. రిషి షాక్ అవుతాడు. వెంటనే వసుధారకి కాల్ చేస్తే వసుధార ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.