English | Telugu
బిగ్ బాస్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసిన మేకర్స్
Updated : Aug 21, 2023
ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని, డేట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్టార్ మా. గత సీజన్స్ లానే అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఐతే ఈ ఈ బిగ్ బాస్ సీజన్ మాత్రం ముందు సీజన్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని నాగార్జున క్లారిటీతో చెప్పేసారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 3వ తేదీన అని ప్రోమోలో స్పష్టం చేశారు. నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్ గా చేస్తున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్‌టీఆర్ హోస్ట్ చేశారు. ఆ షోకి మాత్రం పిచ్చ పిచ్చ రేటింగ్స్ వచ్చాయి.
ఆ తర్వాత సీజన్ లో కూడా ఆయనే హోస్ట్ గా రావాలని ఆడియన్స్ కోరుకున్నారు. కానీ సీజన్ 2 లో మాత్రం నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. అయితే నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో, అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా ఎదురయ్యింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నేచురల్ స్టార్ నానిని తీసుకోలేదు. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ సీట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ఐతే నాగార్జున హోస్ట్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నా ఇంకో వర్గం ప్రజలు మాత్రం సేమ్ హోస్ట్ నే చూడలేకపోతున్నాం....జూనియర్ ఎన్టీఆర్ లా బేస్ వాయిస్ లేదు, ఇంట్రోస్ అవి చెప్పకుండా సింపుల్ గా చిన్న ఇంట్రోతో సరిపెట్టేస్తున్నారు తప్ప ఒక సెన్సేషన్ ఉండడం లేదు కంటెంట్ లో అని కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రతీ సారీ షోకి ముందు హోస్ట్ మారుతున్నారని అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ చివరికి నాగార్జున మాత్రమే హోస్ట్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.. ఏదేమైనా ఈ సారి బిగ్ బాస్ మొత్తం ఉల్టా పుల్ట అంటున్నారు అంత స్పెషల్ గా ఈ రాబోయే షోలో ఏమేం మార్పులు చేశారో తెలియాలంటే ఇంకొక్క పది రోజులు ఆగితే తెలిసిపోతుంది.