English | Telugu

కల నిజమాయెనే..నా పేజీకి కూడా బ్లూ టిక్ వచ్చేనే...ఆనందంలో గీతూ.

చిత్తూరు చిరుత అంటూ తెగ సందడి చేసే గీతూ రాయల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బిగ్ బాస్ షోల పై రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది ఈ గీతూ. అలా ఫేమస్ ఐన గీతూ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోలో కూడా ఇలా కనిపించి అలా మెరిసి మాయమయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌‌లోకి 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఈ షోని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనంతగా పేరు తెచ్చిపెట్టింది గీతూ. అలాంటి గీతూ సోషల్ మీడియాలో తన నీతి సూత్రాలతో, జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వంటివి చెప్తూ పాపులారిటీ తెచ్చుకుంది. యూట్యూబ్ లో వెరైటీ వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫోటోషూట్స్ అని, ఫంక్షన్ వీడియోస్ అని ఆదిరెడ్డితో డాన్సులని అన్ని ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి తన ఇన్స్టాగ్రామ్ పేజీ వెరిఫై అయ్యి బ్లూ టిక్ వచ్చేసరికి పండగ చేసుకుంటోంది.

ఆ గుడ్ న్యూస్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. " చిన్నప్పటినుంచి అందరి బ్లూ టిక్ ప్రొఫైల్స్ చూసి నాది కూడా ఏదో ఒక రోజు వెరిఫై అవ్వాలి అనుకున్నా..ఆ కల ఈరోజు నిజమైపోయింది" అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. సెలబ్రిటీ ఫీల్ వస్తోంది విత్ ఆనంద బాష్పవాలు అంటూ కామెంట్ పెట్టుకుంది. గీతూ రాయల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో 55 మంది ఫాలోయర్స్ ఉన్నారు. గీతూ చెప్పే జీవిత సత్యాలు గమ్మత్తుగా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లో తన ఎలిమినేషన్ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. చాలా రోజులు మీడియా ముందుకు రాకుండా ఏడుస్తూనే ఇంట్లో ఉంది. తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.