English | Telugu
అమ్మకు ప్రేమతో స్పెషల్ ఎపిసోడ్ గా తెలుగు ఇండియన్ ఐడల్..!
Updated : May 3, 2023
ఆహా వేదికగా సింగింగ్ సెన్సేషన్ తెలుగు ఇండియన్ ఐడల్ అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి జడ్జ్ లుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, సింగర్స్ కార్తీక్, గీత మాధురి వ్యవహరిస్తుండగా.. హేమచంద్ర యాంకర్ గా చేస్తున్నాడు. అయితే ఈ వారం ఈ షో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వారం ఇండియన్ ఐడల్ కి గెస్ట్ గా సింగర్ స్మిత వచ్చింది. దానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేయగా దానికి విశేష స్పందన లభిస్తోంది.
ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 లో మదర్స్ డే సెలబ్రేషన్ తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. అమ్మకు ప్రేమతో థీమ్ తో సరికొత్తగా మనముందుకొచ్చింది. కంటెస్టెంట్స్ యొక్క మదర్స్ స్టేజీపై రావడం మోస్ట్ ఎమోషనల్ సీన్ గా ప్రేక్షకులను కదిలించే విధంగా ఉంది. "కంటెస్టెంట్స్ అందరు బాగా పాడుతున్నారు.. నేను చాలా రోజులు నుండి చూస్తున్నాను" అని అందరిని స్మిత మెచ్చుకుంటుంది. "నల్లనివన్ని నీళ్ళని తెల్లనివన్ని పాలని" అనే పాటతో స్టేజిని శృతి ఎమోషనల్ చేసింది. ఆ పాట స్టార్ట్ అవగానే ఎమోషనల్ మూమెంట్ అనిపించిందని స్మిత అంటుంది. ఆ తర్వాత శృతి మదర్ స్టేజి పైకి వస్తుంది. జడ్జ్ గా చేస్తున్న థమన్ ఎమోషనల్ అవుతాడు.
మా అమ్మ నాకోసం తన జీవితాన్ని త్యాగం చేసిందని చెప్తూ థమన్ ఎమోషనల్ అవుతాడు. "జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే" అంటూ కార్తిక్ పాడిన పాట ఎమోషనల్ గా సాగింది. అందరు బాలు గారు పాడినట్లు అంటున్నారు కాని నాకు కార్తీక్ పాడినట్లని అనిపించిందని కార్తీక్ ని ఉద్దేశించి గీతామాధురి అంటుంది. కంటెస్టెంట్ కార్తీక్ మదర్ స్టేజి మీదకి రాగానే.. అమ్మ గిఫ్ట్ అంటూ వాచ్ ఇస్తాడు కార్తీక్. ఆ తర్వాత "ఆడజన్మకి ఎన్ని శోకాలో" అంటూ సౌజన్య పాడుతుంది. ఆ పాటకి గీత మాధురి ఏడుస్తుంది. కాసేపటికి సౌజన్య మదర్ స్టేజి పైకి రాగానే తన గురించి గొప్పగా చెప్తుంది సౌజన్య. "సువ్వి సువ్వి సువ్వాలమ్మ " అంటూ కార్తికేయ పర్ఫామెన్స్ ఇస్తాడు. కార్తికేయ మదర్ స్టేజి మీదకి రాగానే మా అమ్మ, అమ్మమ్మ నా గురువులని కార్తికేయ అంటాడు.
నేను చిన్నప్పుడు పాడుతుంటే మా అమ్మ వచ్చి ఆడియన్స్ లో కూర్చుని ఎలా చూసేదో మీరు పాడుతుంటే.. మీ మదర్స్ వచ్చి అలా చూడడం.. మదర్స్ డే సెలెబ్రేట్ చేస్తూ మిమ్మల్ని దీవించడం.. ఐ థింక్ సచ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్ అని స్మిత అంది. ప్రౌడ్ మూమెంట్ గా తెలుగు ఇండియన్ ఐడల్-2 ప్రోమో ఉంది. దీంతో ఈ ప్రోమోకి విశేష స్పందన లభిస్తుంది.