English | Telugu
శేఖర్ మాస్టర్ ఈరోజు కేసిపిడి అన్న ఆది...ఎలిమినేట్ ఐన సుదర్శన్ మాస్టర్
Updated : May 3, 2023
ఢీ షో ఛాంపియన్ షిప్ బాటిల్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షో క్వాటర్ ఫైనల్స్ లో టీం ఏ కంటెస్టెంట్స్ తమ డాన్సేస్ తో ఇరగదీసాడు. ఇక ఇందులో ఆది, పండు, జెస్సి స్కిట్స్ కూడా బాగా నవ్వు తెప్పించాయి. పండు రంగురంగుల షర్ట్ వేసుకుని స్టేజి మీదకు వచ్చేసరికి "బుడబుక్కలోడు వచ్చాడు" అన్నాడు శేఖర్ మాస్టర్. "ఢీకి ప్రాక్టీస్ చేయడానికి ఫ్లోర్ చాలా దూరమైపోయింది..అందుకే సెట్ లో ఒక ఇల్లు ఉంది కదా దాన్ని రెంట్ కి అడుగుదాం అనుకుంటున్నా" అని ప్రదీప్ ని అడిగేసరికి ఆది, జెస్సి దగ్గరకు పంపించాడు. "వైజాగ్ లో రూములన్నీ ఇపోయాయా మా రూమ్ మీద పడ్డావ్" అని ఆది సెటైర్ వేసాడు. "మా రూమ్ లో ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి.
డాన్స్ అస్సలు రాకూడదు. అడ్వాన్స్ ఒక లక్ష రూపాయలు కట్టాలి..తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి డబ్బులు ఇస్తేనే తీసుకుంటాం.." అనేసరికి "మనకు రూమ్ కావాలి రిక్వెస్ట్ చేసి అడుగు" అని శేఖర్ మాస్టర్ చెప్పాడు. +"సరే నీకు రెంట్ కి రూమ్ కావాలంటే మా జెస్సిని ఒప్పించు..నువ్వు ఉండడానికే కదా..మీరు ఇద్దరూ కలిసి ఉండడానికి కాదు కదా" అన్నాడు ఆది. ఇక జెస్సి, పండు రూమ్ లోకి వెళ్లి కాసేపు ఓవర్ యాక్షన్ చేసి వచ్చారు. ఈ షోలో శేఖర్ మాస్టర్, శ్రద్దా చేసిన డాన్స్ కి ఈలలు, చప్పట్లు పడ్డాయి. "అసలు మహేష్ బాబు చేసిన డాన్స్ స్టెప్స్ లేవు కదండీ మీకు నచ్చిన స్టెప్స్ అన్నీ చేశారు" కదా అని ఫీలయ్యాడు ఆది. వీళ్ళ డాన్స్ చూసిన ఆది శ్రద్ద కుర్చీలో కూర్చుని "ఈరోజు మీరు చిత్తడి చిత్తడి చేసారు, స్టేజిని రఫ్ఫాడించారు ఇంకాచెప్పాలంటే శేఖర్ మాస్టర్ ఈరోజు కేసిపిడి" అని పొగిడేసాడు. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో గ్రీష్ణ, సోమేష్, సుదర్శన్, రేవంత్ మాస్టర్స్ పోటీ పడ్డారు. ఫైనల్ గా సుదర్శన్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. మిగతా ముగ్గురు ఢీ-15 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.