English | Telugu
లోకులు కాకులు ఆంటీ గెటప్ తో శీను...ఎవడ్రా వాడు అనేసరికి షాక్!
Updated : Aug 27, 2022
లోకులు కాకులు అనే డైలాగ్ తో నోరు తెరిస్తే బూతులతో ఫుల్ ఫేమస్ ఐన ఆంటీ గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఈవిడ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఎంత టాలెంట్ ఉన్నా ఫేమస్ అవలేరు. కానీ కొందరు మాత్రం ఎలాంటి టాలెంట్ లేకపోయినా మోతమోగే పేరు వచ్చి పడిపోతుంది. సినిమా రివ్యూస్ చెప్తూ ఈవిడ మస్త్ ఫేమస్ ఐపోయింది. ఇక యూట్యూబ్ లో ఈవిడ వీడియోస్ చూస్తే కొన్ని అర్థమవుతాయి... సగం మాటలు మింగేస్తుంది అసలు అర్ధమేకావు. అలాంటి ఆంటీని గెటప్ శీను ఇమిటేట్ చేసి ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ వేసాడు.
ఈ స్కిట్ లో హౌస్ ఫుల్ అనే మూవీ గురించి రాంప్రసాద్, సన్నీ వచ్చి రివ్యూ అడుగుతారు. అప్పుడే ఒరిజినల్ లోకులు కాకులు ఆంటీ కూడా ఈ స్టేజి మీదకు వస్తుంది. ఇక ఎవరు డూప్ ఎవరు ఒరిజినల్ అన్న కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేశారు..తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ మంచిగా నవ్వు తెప్పించింది. "జబర్దస్త్ చాలా బాగుంటుంది బాగా నవ్విస్తుంది" అని చెప్తుంది ఆంటీ. వెంటనే రాంప్రసాద్ " గెటప్ శీను బాగా చేస్తున్నాడా" అని అడిగేసరికి "వాడెవడ్రా" అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు విరుస్తాయి.
తర్వాత "ఇమ్మునూయేలు వర్ష లవ్వు " అని ఇమ్ము అడిగేసరికి " థు..నీ" అని తిడుతుంది. "ఆ అమ్మాయిని చాలా బాగుంటుంది" అని ఇమ్ము చెప్పేసరికి " ఆ అమ్మాయి బాగుంటుంది..కానీ నువ్ బాగుండవ్" అని చెప్తుంది. ఆ మాటకు అందరూ పడీపడీ నవ్వేస్తారు. ఇలా లోకులు కాకులు ఆంటీ, గెటప్ శీను ఈ వారం స్కిట్ అదరగొట్టేసారు. ఇక ఈ స్కిట్ లో గెటప్ శీను యాక్షన్ కి ఫ్యాన్ ఐపోయినట్లు విజిల్ వేసి మరీ చెప్తుంది ఖుష్బూ. అలాగే "లోకులు కాకులు ఆంటీకి మా టీమ్ తరపున హెల్ప్ చేస్తాం" అని చెప్పాడు శీను.