English | Telugu

శీను వచ్చాడు... సందడి తెచ్చాడు... మరి సుధీర్ ఎప్పుడో?

జబర్దస్త్ కమెడియన్స్ అందరినీ మళ్ళీ వెనక్కి తెస్తామని మల్లెమాల వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారనిపిస్తోంది. ఎందుకంటే గెటప్ శీను రాబోయే వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు.

శీను ఎంట్రీతో స్టేజి మొత్తం కళకళలాడిపోయింది. ఇంద్రజ, రష్మీ, ఆటో రాంప్రసాద్, సన్నీ ముఖాల్లో వెలుగొచ్చింది. ఇంద్రజ ఆ ఆనందంతో శీనుని హగ్ చేసుకుంది. ఇంతలో రాంప్రసాద్ స్టేజి మీద నుంచి "మేడం మా శీను వచ్చాడు, స్కిట్ చేద్దామనుకుంటున్నాం, మాకు కొంచెం టైం ఇస్తే" అంటాడు...మీరు ముందు ఈ స్కిట్ ని ప్యాక్ చేసేసి వెళ్ళిపోయి, మా శీనుని వెనక్కి తీసుకొచ్చేయండి చెప్తాను " అంటూ ఇంద్రజ చాలా ఎక్సయిట్మెంట్ తో అంటుంది ఇంద్రజ.

ఇక గెటప్ శీను ఈజ్ బ్యాక్ అంటూ రాంప్రసాద్, శీను, అన్నపూర్ణమ్మ, బాబు, సన్నీ అంతా కలిసి స్కిట్ వేస్తారు. "మావాడు కమలహాసన్ లా చేస్తాడు" అంటాడు రాంప్రసాద్ . "కమలహాసన్ లా మీ వాడు చేస్తే కమల్ హాసన్ ఏం చేస్తాడు..టీవీ చూస్తూ బఠానీలు తింటాడా " అంటూ పంచ్ డైలాగ్ వేసేస్తుంది అన్నపూర్ణమ్మ. మావాడు ఇప్పుడు కమల్ హాసన్ లా చేసి చూపిస్తాడు నువ్ కూడా అలా చేసి చూపించు" అంటాడు రాంప్రసాద్. అలా శీను, అన్నపూర్ణమ్మ ఇద్దరూ స్కిట్ ని అద్భుతంగా పండిస్తారు.

శీను స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వడంతో ఆడియన్స్ కళ్ళల్లో ఆనందం కనిపించబోతోంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ ఐతే మాములుగా లేవు. " టిఆర్పీ ఊపిరి పీల్చుకో .. మా గెటప్ సీను అన్న వస్తున్నాడు..అలాగే మన సుధీర్ అన్న కూడా వస్తాడు వీళ్ళ ముగ్గురూ కలిసి మళ్ళీ స్కిట్స్ చేయాలని కోరుకుంటున్నా..ఇలాగే వెళ్లిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చి పూర్వవైభోగం తేవాలి....శ్రీను రావడం చాలా హ్యాపీ గా ఉంది...శ్రీను రావడంతోనే నాకు స్మైల్ ఆగలేదు బ్రో" ఇలా కామెంట్స్ వరద కురుస్తోంది.

ఇక జబర్దస్త్ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందనే విషయం గెటప్ శీను ఎంట్రీతో ఆడియన్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది మల్లెమాల. ఇక సుధీర్ ఎంట్రీ ఎప్పుడో?