English | Telugu
అలాంటి వారికోసమే నా "కామాతురాణాం" రీల్!
Updated : Nov 11, 2022
అష్షు రెడ్డి ఎంతో బోల్డ్ గా ఉండే అమ్మాయి. ఆమె ఎంత బోల్డో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉండే ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. ఇక అలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినప్పుడల్లా నెటిజన్స్ ఫుల్ గా ట్రోల్ చేస్తూ చెత్త చెత్త కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఐతే అషూరెడ్డి అలాంటి వాటిని అసలు పట్టించుకోదు.
కానీ, ఈ మధ్య ట్రోల్స్ చేసేవారికి, ఇలాంటి కామెంట్స్ పెట్టేవారికి అషూ చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ అషూ తాజాగా ఓ రీల్ చేసింది. "దేశముదురు" మూవీలో రమాప్రభ చెప్పిన "కామాతురాణం" అనే డైలాగ్‌ని రీల్ గా చేసి తన ఖాతాలో పోస్ట్ చేసి చాలామందికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ రీల్‌కి ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. "నా ప్రొఫైల్ లో కామెంట్ చేసే కొందరికి దీనిని అంకితం చేస్తున్నా" అని చెప్పింది .
అయితే ఈ రీల్‌కి కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. "కొందరైతే ముందు నీకు అవన్నీ ఉన్నాయా" అని అడుగుతుంటే "ఇంకొందరు అయితే మాకు అవన్నీ లేవు.. మేము ఎప్పుడో వదిలేశాం" " నువ్వే చెప్పాలి మాకు" అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఆమె డ్రెస్సింగ్ గురించే కామెంట్ చేస్తున్నారు.