English | Telugu

సుధీర్ కు  ప్రపోజ్ చేసిన గీతూ...ఆ టైములో సూసైడ్ చేసుకోబోయా అన్న జ్యోతి

రష్మీ సుధీర్ విడివిడిగా షోస్ చేస్తుండడంతో ఇక్కడ సుధీర్ ని పటాయించడానికి చాలామంది అమ్మాయిలు క్యూలు కడుతున్నారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఫామిలీ స్టార్స్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో సుధీర్ ని ఇద్దరు అమ్మాయిలు గులాబీలతో వెంటపడ్డారు. వాళ్ళే నటి జ్యోతి, గీతూ రాయల్. ఇద్దరూ కూడా ఎర్ర గులాబీలు తీసుకొచ్చి పోటీ పడి మరీ ఇవ్వడానికి ట్రై చేశారు. "చిన్నప్పటి నుంచి నీ మీద ఒక టైపాఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం." అంటూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసాడు జ్యోతి. "నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేటంత ప్రేమ ఉంది నాకు. మనకు పెళ్ళైతే నువ్వు లేచే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకు ఎం కావాలో అది వండి ఎత్తుకుని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి రాత్రి పడుకునే ముందు నీ కాళ్ళు నొక్కుతా బావా" అని గీతూ అనేసరికి "తర్వాత తర్వాత" అన్నాడు సుధీర్...ఆ మాటకు గీతూ తెగ సిగ్గు పడిపోతూ గులాబీ పువ్వు ఇవ్వడానికి కూడా చేతులు వణుకుతున్నాయి" అంది.

ఇక ఈ ఇద్దరితో సుధీర్ కోదాం డ్యూయెట్ డాన్స్ లు వేసి అలరించాడు. వీళ్లకు తగ్గట్టు అతిలోక సుందరి గెటప్ లో వచ్చిన పాగల్ పవిత్ర వచ్చి "మానవా ఏది నీ వామ హస్తము ఇమ్ము" అని అడిగింది కానీ తన చేతులను జేబుల్లో దాచేసుకుని ఇవ్వను అన్నాడు. ఇక నటి జ్యోతి గురించి సుధీర్ అడిగేసరికి తన లైఫ్ లో జరిగిన విషయం చెప్పింది. "ఒకానొక టైములో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. నేను సూసైడ్ చేసుకోబోయా..." అన్న మాట చెప్పేసరికి అష్షు రెడ్డితో పాటు అందరూ షాకయ్యారు. ఇక అక్కడి వాళ్లంతా కూడా తమ బాధల్ని చెప్పుకొచ్చారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.