English | Telugu
బ్యాడ్ గర్ల్స్ టు బ్యాంకాక్ అంటున్న గీతు రాయల్!
Updated : Aug 24, 2023
గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.
గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే ఈ మధ్యే తను శ్రీలంక టూర్ కి వెళ్ళి వచ్చింది. అది పూర్తయిన నెలలోనే థాయ్ లాండ్ కి వెళ్ళింది. అయితే ఈసారి ఒక్కతే వెళ్ళకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీసత్య, వాసంతి కృష్ణన్ ని తీసుకెళ్ళింది గీతు రాయల్. అక్కడ వాళ్ళ హంగామా మాములుగా లేదన్నట్టుగా వీడీయోలతో ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నారు ముగ్గురు. వాసంతి కృష్ణన్ తన ఇన్ స్టాగ్రామ్ లో థాయ్ లాండ్ లోని పుకెట్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ప్రతీ చోటుని కవర్ చేస్తుంటే, శ్రీసత్య కూడా అందులో భాగమవుతుంది.
అయితే గీతు రాయల్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒకటే మ్యూజిక్ అంటూ డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొడుతుంది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ట్రిప్ ప్లాన్ చేశారంట. అది అనుకోకుండా సక్సెస్ అయిందని గీతు రాయల్ తన ఇన్ స్టాగ్రామ్ లో అక్కడికి వెళ్ళేముందు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ -6 భామలు అలా బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్నారు.