English | Telugu
తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ చెప్పిన మల్లి!
Updated : Aug 24, 2023
భావన లాస్య.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ 'మల్లి' అంటే అందరికి సుపరిచితమే. ఎందుకంటే 'మల్లి' సీరియల్. స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కి విశేష ఆదరణ లభిస్తుంది. మల్లి సీరియల్ లో అరవింద్ ని ఇష్టపడి, ఆ తర్వాత మాలిని కోసం తన ప్రేమను త్యాగం చేసి వదిలి వెళ్తుంది మల్లి. ఆ తర్వాత మల్లి చేస్తోన్న ఆఫీస్ లోనే అరవింద్ జాబ్ కి జాయిన్ అవుతాడు. మాలిని తనని జాబ్ మానేయమని, లేదా అరవింద్ ని జాబ్ మానేయమని చెప్తుంది. నేనెలా చెప్తానను మల్లి అంటుంది. ఇది భోనాల జాతరలో మల్లి, మాలినిల సంభాషణ. మరి మాలిని చెప్పినట్టు మల్లి చేస్తుందా.. దూరంగా వెళ్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
అయితే మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది. ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించని భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ట్రెండింగ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ అదరహో అనిపిస్తుంది భావన లాస్య. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మి క్వశ్చనింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో ఒక్కొక్కరు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది భావన లాస్య. ఇన్ స్టాగ్రామ్ లో పేరు ఎందుకు చేంజ్ చేశారు? వైరల్ అయ్యారనా అని ఒకరు అడుగగా.. లేదు. ఇది నా ఐడీ అని భావన లాస్య అంది. మీ ఫేస్ లో ఎప్పుడు నవ్వునిచ్చేదేంటని ఒకరు అడుగగా.. "ఫుడ్, మై ఫామ్, నన్ను అభిమానించే నా వాళ్ళు" అని రిప్లై ఇచ్చింది. నిన్ను బ్లాక్ సారీలో చూసాక ఇంకేం అడుగుతారు.. కవితలు రాయడం తప్ప అని ఒకరు క్వశ్చన్ చేయగా.. అంతే అంటావా అని నవ్వేసింది భావన లాస్య. బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అని ఒకరు అడుగగా.. నెనెక్కడికి వెళ్ళినా అక్కడికి రావాలి.. నాతోనే ఉండాలి, ఎప్పుడైనా,ఎక్కడైనా దగ్గరగా ఉండాలని రిప్లై ఇచ్చింది. నీ ఫస్ట్ మ్యారేజ్ గురించి గౌతమ్ సర్ కి తెలిస్తే ఏం జరుగుతుంది అని ఒకరు అడుగగా.. బ్లాస్ట్ అని రిప్లై ఇచ్చింది భావన లాస్య. ఇలా కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేసింది భావన లాస్య.