English | Telugu

ప్రిన్స్ యావర్ , గౌతమ్ కృష్ణల మధ్య మాటల యుద్ధం!

బిగ్ బాస్ సీజన్-7 లో అనేక గేమ్స్, టాస్క్ లు, స్ట్రాటజీలు, మలుపులు జరుగుతున్నాయి. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో గేమ్ ప్లాన్ తో బిగ్ బాస్ సీజన్-7 పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. గత మూడు రోజుల నుండి సాగుతున్న రణధీర, మహాబలి టీమ్ ల టాస్క్ ఎట్టకేలకు పూర్తయింది. అయితే రణధీర టీమ్ గెలిచింది.

రణధీర టీమ్ లోని ఒక కంటెస్టెంట్ తర్వాతి ఇంటిసభ్యుడవుతాడని బిగ్ బాస్ చెప్పాడు. కాగా రణధీర టీమ్ లో శివాజీ, షకీల, ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఉన్నారు. కాగా వీళ్ళలో నుండి ఒకరిని ఎన్నుకోవడానికి వారి ప్రత్యర్థులైన మహాబలి టీమ్ లోని వారిని ఎన్నుకోమనగా.. మొదట పల్లవి ప్రశాంత్ శివాజీని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత దామిణి వచ్చి షకీలకి ఇచ్చింది. అయితే రతిక చేసిన ఓవారాక్షన్ కి ఆ తర్వాత ఓటింగ్ ని క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్. కీ ఉన్నావారే కంటెస్టెంట్స్ అర్హులని చెప్పగా.. అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి పోటీ నుండి అనర్హులుగా మిగిలారు. ఇక అప్పుడే గౌతమ్ కృష్ణ వచ్చి ప్రిన్స్ యావర్ అనర్హుడని అతడి దగ్గర ఉన్న కీ తీసి శివాజీకి ఇచ్చాడు. దాంతో కొత్త కథ మొదలైంది. ఎందుకు నన్ను డిస్ క్వాలిఫై చేశావ్ చెప్పు అంటూ యావర్ విరుచుకుపడ్డాడు. 'టెల్ మి ది ప్రాపర్ రీజన్.. నువ్వు నన్ను అనర్హుడని చెప్పడానికి సరైన కారణం చెప్పు' అని గౌతమ్ కృష్ణ మీద ప్రిన్స్ యావర్ ఫైర్ అయ్యాడు. ఇక అక్కడే ఉన్నవాళ్ళ‌ంతా కామ్ డౌన్, కూల్ డౌన్ అంటూ ప్రిన్స్ యావర్ ని ఎంత రిక్వెస్ట్ చేసిన వినలేదు. గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

ఇక కాసేపటికి ప్రిన్స్ యావర్ కూల్ అయ్యాడు. ‌తన మైక్ తీసేసిన యావర్.. బిగ్ బాస్ తో మాట్లాడాలని అన్నాడు.‌ ఇక యావర్ ని బిగ్ బాస్ ‌సీక్రెట్ రూమ్ కి పిలుస్తాడు. అక్కడ అతను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోతానని చెప్పగా.. లైఫ్ లో ఎత్తులు, లోతులు వస్తాయి. ప్రతీ దగ్గర పాలిటిక్స్ ఉంటాయి. ఉండి పోరాడు. నీ పోరాటాన్ని సామరస్యంగా కొనసాగించు అంటూ ప్రిన్స్ యావర్ కి బిగ్ బాస్ మోటివేషన్ ఇస్తాడు. అది విన్న ప్రిన్స్ యావర్ నార్మల్ అవుతాడు. ప్రిన్స్ యావర్ బయటకొచ్చాక అందరితో కూల్ గా మాట్లాడతాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..