English | Telugu

గణేష్ మాస్టర్ విజిల్  ఆది సీరియస్ ?


ఢీ-14 1980 స్పెషల్ సాంగ్స్ ఎపిసోడ్ మంచి డాన్సస్ తో పంచ్ డైలాగ్స్ తో సాగిపోయింది ఈ వారం. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఆనాటి రెట్రో స్టయిల్లో డ్రెస్సింగ్ చేసుకుని డాన్స్ పెర్ఫార్మ్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆది తేజస్వినిని తన వైఫ్ గా పరిచయం చేసాడు. తేజస్విని "రూప్ తేరా మస్తానా" సాంగ్ కి సాయికుమార్ అనే కుర్రాడితో కలిసి అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ డాన్స్ చూసి నందిత శ్వేతా, గణేష్ మాస్టర్, శ్రద్దా దాస్, గెస్టులుగా వచ్చిన సుశాంత్ , ప్రియా ఆనంద్ కూడా ఫిదా అయిపోయారు. ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ అయ్యాక ఆది కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసాడు. ఇప్పటికే తేజు నలుగురు పిల్లల తల్లి. ఇల్లాంటి పొట్టి బట్టలు వేసుకోవద్దు అంటే వినడం లేదు అంటూ ఒక క్లాత్ తీసుకెళ్లి ఇది కప్పుకో అని ఇస్తాడు.


సుశాంత్ కూడా ఆది వెనకాలే వెళ్లి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తాడు స్టేజి మీద. మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకోండి, వాళ్లకు నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు అని చెప్తాడు. ఆఫ్రికన్ స్టయిల్లో వేసిన స్టెప్స్ ని మళ్ళీ ఒకసారి వేయండి అంటూ తేజుని , సాయికుమార్ ని అడుగుతాడు గణేష్ మాస్టర్. వాళ్ళు మళ్ళీ ఆ స్టెప్స్ వేసి చూపించేసరికి ఆదికి కోపం వచ్చేస్తుంది. మాస్టర్ "మా ఆవిడ ఒక్కసారి చేయడమే వద్దు అనుకుంటున్నాను కానీ మీరు మళ్ళీ మళ్ళీ మా ఆవిడతో డాన్స్ చేయించి విజిల్ కూడా వేస్తున్నారు" అని ఉడుక్కుంటాడు. ఇక ఈ ఎపిసోడ్ లో నైనిక, శ్వేతనాయుడు టీం లీడర్స్ గా ఎంట్రీ ఇచ్చారు. షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నైని "బావ బావ" అంటూ ప్రదీప్ ని ఆటపట్టిస్తూ అలరించింది.