English | Telugu

నెటిజన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఏజెంట్ ఆనంద్ సంతోష్

సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇక్కడ సీక్రెట్స్ ఏమీ ఉండవ్. ఎవరికీ ఏది నచ్చితే అది మాట్లాడేసుకుంటారు. పోట్లాడుకుంటారు. సెలబ్రిటీస్ పోస్టులకు నెటిజన్స్ కూడా హోరాహోరి మాటల యుద్దాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరిమధ్య ఐనా సీరియస్ చాటింగ్ జరిగేటప్పుడు కొంతమంది నెటిజన్స్ ఆ చాటింగ్ మధ్యలోకి వచ్చేసి అనవసరమైన టాపిక్స్ తీసుకొచ్చి పక్కనోళ్ళను ఇరికించేసి చల్లగా వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి ఒక కాంట్రవర్సీ టాపిక్ ఒకటి ఒక నెటిజన్ కి షణ్ముఖ్ కి మధ్యన జరిగింది. శ్రీరామచంద్ర, యాని మాస్టర్ , సన్నీ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో చాటింగ్ చేసుకుంటూ ఉండగా ఒక నెటిజన్ మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి "షణ్ముఖ్ తన యూట్యూబ్ జర్నీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షణ్ణుకి కంగ్రాట్స్ చెప్పండి యాని మేడం" అంటూ ఒక కామెంట్ పెట్టాడు . ఈ కామెంట్ చూసిన షణ్ముఖ్ అలియాస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ వచ్చి "నువ్వెంట్రా బాబు అందరి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతున్నావు" అని అడిగేసరికి మళ్ళీ ఆ నెటిజన్ తనదైన స్థాయిలో షన్నుకి సపోర్ట్ చేసాడు.

"తప్పు లేదు బ్రో..శ్రీరామచంద్ర, యాని మాస్టర్, సన్నీ వీళ్ళను వీళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు..చెప్పాలంటే నీకు వీళ్ళ ప్రమోషన్స్ ఏమీ అవసరం లేదు. మేమంతా ఉన్నాం ప్రమోట్ చేయడానికి" అని రిప్లై ఇచ్చాడు. "ఇలాంటి కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు బ్రో" అంటూ షన్ను స్వీట్ వార్నింగ్ లాంటి ఒక మెసేజ్ పెట్టేసరికి ఏమనుకున్నాడో ఏమో ఆ నెటిజన్ మళ్ళీ "ఎందుకు తప్పు కాదు. నేనేమన్నా నెగిటివ్ కామెంట్ పెట్టానా..పని గట్టుకుని ఎవరి జీవితం నాశనం చేసానా..నా హీరో ప్రాజెక్ట్ గురించి నేను ప్రమోట్ చేస్తున్నాను. అదేం తప్పు కాదు" అంటూ అదే స్పీడ్ తో రివర్స్ రిప్లై ఇచ్చాడు షణ్ణుకి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.