English | Telugu

నాగార్జునని కలిసిన గలాటా గీతు.. వైరల్ అయిన చిరుత టాటు!

బిగ్ బాస్ హౌజ్ లో ఒక వెలుగు వెలిగిన గలాట గీతు..తొమ్మిదో వారంలో ఊహించ‌ని విధంగా ఎలిమినేట్ అయింది.ఇప్పటికీ ఆమెఆ బాధ నుండి బయటకు రాలేకపోతుంది. హౌస్ లోమొన్నటి వరకు జరిగిన ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌ చూస్తూ ఏడ్చేసింది. "నేను హౌస్ లో ఉండి ఉంటే నా ఫ్యామీలి కూడా వచ్చేది" అని అనుకుంటూ బాధపడింది గీతు.

అయితే లేటేస్ట్ గా గీతు తన సోషల్ మీడియాలో నాగార్జునతో కలిసి దిగిన ఫోటోతో కూడిన వీడియోని అప్లోడ్ చేసింది. ఆ ఫోటో గురించి మాట్లాడుతూ "నాగార్జున సర్ నుండి పిలుపు వచ్చింది" అని చెప్పింది. ఇంకా తను ఎలిమినేట్ అయినప్పుడు బాగా ఏడ్చేసింది. అది ఇప్పుడు చూసుకొని ఏమిరా సామి అలా ఏడ్చేసాను అని తన మీద తనకే జాలేసిందని చెప్పింది. అయితే హౌస్ లో ఉన్నప్పుడు తనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని కలలు కన్న గీతుకి.. బిగ్ బాస్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగార్జున నుండి పిలుపు వచ్చిందంటూ అప్లోడ్ చేసిన వీడియోకి విశేష స్పందన రావడంతో, ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే చిత్తూరు చిరుతతో మామూలుగా ఉండదంటూ, చిరుత చారలు టాటూగా వేసుకుంది. అది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "chittoor Chirutha..A Painful but a Perfect Tattoo..No Pain No Gain" అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది గీతు. ఇంకా తన యూట్యూబ్ ఛానల్‌లో బిగ్ బాస్ కి వెళ్ళే ముందు చేసిన సెల్ఫ్ డబ్బా వీడియో అంటూ మరొక వీడియో అప్లోడ్ చేయగా మంచి స్పందన వస్తోంది.