English | Telugu

వాళ్ళ అమ్మలాగా అనిపిస్తుందని సిరికి చెప్పిన తన అభిమాని!

సిరి హనుమంత్.. యూట్యూబ్ లో లఘచిత్రాలతో పాపులర్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉన్నా, తను ఏ విషయమైన అందరితో పంచుకోవాలన్న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది ఈ భామ.

బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాక సిరికి ఇంకా పాపులారిటి పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే తను చేసిన షార్ట్ ఫిల్మ్ లు అన్నీ కూడా మంచి వీక్షకాదరణ పొందాయి. దాంతో తనొక యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టింది. రీసెంట్ గా ఆ ఛానెల్ కి 100k సబ్ స్క్రైబర్స్ వచ్చినట్లు తెలిపింది సిరి. అయితే కొన్ని సినిమాలలో కూడా నటించిన సిరి.. ఇటీవల తను పులి-మేక వెబ్ సిరీస్ లో ఒక కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.. అయితే పులి-మేక రెండవ పార్ట్ గురించి ఒక అప్డేడ్ ని ముందుగానే చెప్పేసింది.

అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' ని స్టార్ట్ చేసిన సిరి.. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయలాను అభిమానులతో పంచుకుంది. ఒక అభిమాని మీరు బాగుంటారు.. మాలాంటి ఎంతో మందికి మీరే ఇన్సిపిరేషన్ అని అనగా.. ఓహ్.. థాంక్స్ సో మచ్ అని రిప్లై ఇచ్చింది సిరి. శ్రీహాన్ ఎక్కువ బయటకు వెళ్ళడా ఎవరిని కలవడా అని ఒక అభిమాని అడిగి ప్రశ్నకు.. వెళ్తాడు చాలా తక్కువ అని సమాధనమిచ్చింది సిరి. మరొకరు శ్రీహాన్ అన్న చేసే వంటలలో ఏది ఫేవరేట్ అని అడుగగా.. అన్నీ ఇష్టమే.. ఏది ఫేవరేట్ అని చెప్పలేను.. ఎందుకంటే తను అన్ని వంటలు బాగా చేస్తాడని చెప్పుకొచ్చింది సిరి. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి.. చైతు ఫోటోని అప్లోడ్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మలాగా అనిపిస్తుంది.. మీరు చైతు మీద చూపించే కేరింగ్, లవ్ అన్నీ మా అమ్మని గుర్తుచేస్తాయి అని ఒక అభిమాని అడుగగా.. 'Aww So Sweet of you' అని సమాధానమిచ్చింది సిరి. ఇలా తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' లో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది సిరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.