English | Telugu

అత్యధిక టీఆర్పీతో బ్రహ్మముడి నెంబర్ వన్ ర్యాంక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. అయితే ఈ వారం టీర్పీలో బ్రహ్మముడి టాప్-1 గా నిలిచింది. గతవారం కూడా ఈ సీరియలే మొదటి స్థానంలో రావడం విశేషం. ఆ తర్వాత స్థానాలలో నాగపంచమి, కృష్ణ ముకుంద మురారి, గుప్పెడంత మనసు సీరియల్స్ ఉన్నాయి.

బ్రహ్మముడి సీరియల్ మొదటి ర్యాంక్ రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిది కార్తీకదీపం టైం స్లాట్ లో రావడం.. రెండవది ఈ సీరియల్ కథ బాగుండటం.. ఇంకా సెలబ్రిటీలు సైతం ఈ సీరియల్ కి ప్రమోషన్స్ చేయడం.. అన్నింటికి మించి బిగ్ బాస్ సెలబ్రిటీ అయిన మానస్ ఇందులో ముఖ్యపాత్రలో కన్పించడం.. ఇలా చాలానే అంశాలు ఈ వీక్షకాదరణకి కారణమవుతయన్నాయి. ఈ సీరియల్ లో మధ్యతరగతి కుటుంబంలోని పరిస్థితులు వాటికి తగ్గట్టు వారి ఆలోచనలు, ఆశలు ఎలా ఉంటాయో వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కుంటారో చూపిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అయితే బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి‌.. ఒక మధ్యతరగతి అమ్మాయి వస్తే ఎలా ఉంటుందోనని.. అక్కడ తనని ఎంత అవమానించినా, విమర్శించినా తను ఎదురునిలబడి ఎలా నిలదొక్కుకుందో తెలిపే కథే ఈ 'బ్రహ్మముడి'.

కనకం-కృష్ణమూర్తిలది మధ్యతరగతి కుటుంబం, దుగ్గిరాల కుటుంబం ధనిక కుటుంబం. అయితే కనకం తన కూతుళ్ళని గొప్పింటికి కోడళ్ళని చేయాలని కలలు కంటూ.‌. తన పెద్ద కూతురికి బాగా డబ్బున్న దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు రాజ్ కి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటుంది. అంతలోనే స్వప్న వేరే అతడితో పారిపోతుంది. దీంతో ఈ కథ మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత స్వప్న స్థానంలో రెండో కూతురు కావ్యని రాజ్ తో పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి జరిపిస్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల కుటుంబాన్ని మోసం చేసి పెళ్ళిచేసారని వాళ్ళు కావ్యని అవమానిస్తుంటారు. అయితే తాజాగా కావ్య వాళ్ళ అక్క స్వప్న తిరిగి రావడంతో కథలో మరో మలుపు తిరిగింది. అయితే స్వప్న ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసుకునే ప్రయత్నంలో రాజ్ తో పాటుగా కావ్య, అప్పు, కళ్యాణ్ ఉంటారు. మరి స్వప్న ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసుకుంటారా లేదా అనే ఆసక్తికరమైన అంశంతో ఈ కథ ముందుకు సాగుతుంది. అందుకే ఈ సీరియల్ అత్యధిక వీక్షకాదరణ పొందుతుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.