English | Telugu

గేమ్స్, డాన్స్ తో ఎంటర్టైన్ చేసిన సమ్మర్ స్పెషల్ కిడ్స్ షో

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం కిడ్స్ స్పెషల్ బాగా ఎంటర్టైన్ చేసింది. చిన్నారులు బాగా నవ్వించారు. ఇక ఈ షోలోకి స్టార్ మా కిడ్స్ అంతా ఎంట్రీ ఇచ్చారు. టీం ఏ నుంచి ఇంటింటి లక్ష్మి సీరియల్ లో హాని రోల్ లో చేసిన శ్రేష్ఠ, ఎన్నెన్నోజన్మల బంధంలో ఖుషి రోల్ నైనికా, కార్తీకదీపంలో సౌర్యగా చేసిన కృతిక, దేవతలో దేవిగా చేసిన అహానా, సూపర్ సింగర్ జూనియర్ జివి శ్రీకీర్తి, ఇంటింటి గృహలక్ష్మిలో లక్కీగా నటించిన అద్వైత్ వచ్చారు. టీమ్ బి లోకి కార్తీక దీపంలో హిమగా నటించిన సహృద, మధురానగరిలో బుడ్డోడు ఆదిత్య, అలాగే "ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమయ్యింది, విరూపాక్ష, మిషన్ ఇంపాసిబుల్, ఏజెంట్" వంటి చిత్రాల్లో నటించిన రోషన్, దేవత సీరియల్ లో చిన్మయి రోల్ లో నటించిన రిధి, ఇక సూపర్ సింగర్ జూనియర్ కామిని వచ్చారు.

శ్రీముఖి, హరి, అవినాష్, ఫైమా కలిసి ఈ చిన్నారులతో గేమ్స్ ఆడించారు. ఐస్క్రీమ్ బండిని పిలిపించి అందరికి కోన్ ఐస్క్రీమ్స్ ఇప్పించారు. అలాగే రిషికేష్ అనే ఒక పొట్టతో ఉన్న భారీ మనిషిని పిలిపించి కాసేపు కుస్తీ పోటీలు కూడా పెట్టింది. అలాగే వాళ్ళతో డాన్స్ కూడా చేయించింది. సూపర్ సింగర్ జూనియర్స్ ఇద్దరితోనూ పాటలు పాడించింది. ఇక ఈ షోలో పరివారం బ్యాంకు నుంచి టీం ఏ డబ్బుని గెలుచుకుని విన్నర్స్ అయ్యారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.