English | Telugu
'Eviction Free Pass' ఫైమా సొంతం!
Updated : Nov 19, 2022
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయాలను చెప్తారు. అయితే ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వడానికి, లేదా ఎవరినైనా సేవ్ చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం ఈ 'Eviction Free Pass'. అయితే ఈ పాస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అవుతారు. అయితే ఇది దక్కించుకోవడానికి బిగ్ బాస్ కొన్ని షరతులతో కూడిన టాస్క్ ని ఇచ్చాడు. అయితే దీనికి ఫైమా, శ్రీహాన్, రేవంత్ మాత్రమే అర్హత సాధించారు.
"బజర్ మోగిన ప్రతీసారి సాండ్ బ్యాగ్ ని భుజాల మీద వేసుకొని మోయాలి. మిగిలిన సభ్యులు వచ్చి ఎవరైతే కెప్టెన్ కి అర్హులు కావొద్దు అని అనుకుంటున్నారో, వారికి ఒక సాండ్ బ్యాగ్ వేయాలి. అయితే ఈ టాస్క్ లో శ్రీసత్య సంచాలకులురాలిగా వ్యవహరిస్తుంది " అని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ మొదలయ్యాక ఆదిరెడ్డి సాండ్ బ్యాగ్ ని రేవంత్ కి వేసాడు. ఆ తర్వాత శ్రీహాన్ కి సాండ్ బ్యాగ్ ని వేసాడు. తర్వాత కీర్తి భట్ కి అవకాశం వచ్చింది. కీర్తి భట్ సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసింది. తర్వాత రాజ్ కి అవకాశం వచ్చింది. అతను రేవంత్ కి సాండ్ బ్యాగ్ ని వేసాడు. ఆ తర్వాత రోహిత్ కి అవకాశం రాగా, సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసాడు.
ఆ తర్వాత రేవంత్ కి, ఆదిరెడ్డికి మాటల యుధ్ధం జరిగింది. "నేను అడుగకుండా మధ్యలో దూరకు" అని రేవంత్ అనగా, "నేను దూరుతా.. మధ్యలోనే వస్తా" అని ఆదిరెడ్డి అన్నాడు. " రేవంత్ బ్రో.. మీరు మాట్లాడే ముందు బ్రెయిన్ తో ఆలోచించండి" అని ఆదిరెడ్డి అన్నాడు. మెరీనా సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసింది. ఆ తర్వాత ఇనయాకి అవకాశం రాగా రేవంత్ కి సాండ్ బ్యాగ్ వేసింది. ఆ తర్వాత కీర్తి భట్ సాండ్ బ్యాగ్ ని రేవంత్ కి వేసింది. ఎక్కువ సాండ్ బ్యాగ్స్ రేవంత్ కి, ఆ తర్వాత శ్రీహాన్ కి పడ్డాయి. కానీ ఫైమా కు రెండు సాండ్ బ్యాగ్ లు ఉన్నాయి. దీంతో ఎక్కువ బరువును, ఎక్కువ సమయం మోయలేక శ్రీహాన్ మొదట డ్రాప్ అవ్వగా, తర్వాత రేవంత్ గట్టిగా ప్రయత్నించి ఓడిపోయాడు. అలా ఫైమా చివరి వరకూ ఉండి విజేతగా నిలిచి..'Eviction Free Pass' ని సొంతం చేసుకుంది.