English | Telugu
సుదీప, అభినయ అప్పుడలా.. ఇప్పుడిలా!
Updated : Sep 6, 2022
సుదీప అంటే పేరు తెలియకపోవచ్చు కానీ 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో పింకీ అంటే చాలు ఎవ్వరికైనా తెలిసిపోతుంది. అందులో ఆర్తి అగర్వాల్ సిస్టర్ గా మంచి పాపులర్ అయ్యింది. ఆమె అసలు పేరు సుదీప. ఇప్పుడు ఈమె లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిల్ ఐపోయింది. ఇక అభినయశ్రీ గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. గ్లామర్ గర్ల్ కూడా. 15 ఏళ్ళ క్రితం ఐటమ్స్ సాంగ్స్ కి చేయడంలో అభినయశ్రీ టాప్ లిస్ట్ లో ఉండేది.'ఆర్య' మూవీలో ఆమె డాన్స్ చేసిన "అ అంటే అమలాపురం" సాంగ్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో తెలిసిందే కదా.
అభినయశ్రీ, సుదీప.. ఇద్దరూ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ హౌస్ లోకి దాదాపు 21 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తుండగా అందులో వీళ్ళిద్దరూ సీనియర్స్. ఇక వీళ్ళతో పాటుఆరోహి రావు, గీతూ రాయల్, శ్రీసత్య, వాసంతి, కీర్తి భట్, ఇనయ సుల్తానా, నేహా చౌదరి, ఫైమ షేక్, మెరీనా ఉన్నారు. ఇప్పుడు హౌస్ లో 11 మంది ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో మాత్రం గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.
ఇక సుదీప, అభినయశ్రీ తప్ప అంత ఫేమస్ పర్సన్స్ ఎవరు లేరు ఈసారి హౌస్ లో. ఇక వీళ్ళిద్దరిని మనం మూవీస్ లో చూశాం. కానీ ఇప్పుడు ఇంతమంది మధ్యలో చూస్తున్నాం. అప్పటికీ, ఇప్పటికీ వారిలో చాలా మార్పు కనిపిస్తోంది. వీళ్ళు హౌస్ లో ఎలా ఆడతారో రాబోయే రోజుల్లో చూడాలి.