English | Telugu

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరి ప్రేమకి మధ్యలో శ్రీలత.. ఆమె డ్రీమ్ నెరవేరుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -211 లో.....పేపర్స్ పట్టుకోబోతుంటే రామలక్ష్మి అనుకోకుండా సీతాకాంత్ కి ముద్దు పెడుతుంది.. నీకు పెడతానని సీతాకంత్ అనగానే.. ముందు పని చూసుకోండి. బోలెడంత కాంపిటీషన్ ఉంది బయట అని అంటుంది. దాంతో సీతాకాంత్ బిట్ వెయ్యడని కొటేషన్ రెడీ చేస్తుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు నిద్రపోతుంటే.. అప్పుడే శ్రీవల్లి మెల్లిగా గదిలోకి వస్తుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ఎక్కడ ఉందని వెతుకుతుంది.

ఆ తర్వాత టేబుల్ మీద కొటేషన్ కవర్ చూసి.. శ్రీవల్లి తీసుకోబోతుంటే అక్కడ కింద ఉన్న ర్యాట్ ప్యాడ్ పై కాలు వేస్తుంది. దాంతో కాలు స్టిక్ అవుతుంది. అలా కొటేషన్ కవర్ తీసుకొని మెల్లిగా ఆ ప్యాడ్ తోనే శ్రీలత దగ్గరికి వెళ్లి తియ్యమంటుంది. ప్యాడ్ తీస్తుండగా శ్రీలత చెయ్ కి అతుకుంటుంది. ఎలాగైనా విడిపించుకుంటారు ర్యాట్ ప్యాడ్. మళ్ళీ అక్కడే పెట్టు లేదంటే డౌట్ వస్తుందని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి నిద్రలేచి రాత్రి జరిగిన విషయం గుర్తుచేసుకుంటుంది. సీతాకాంత్ రెడీ చేసిన కొటేషన్ ని దాచిపెటి రామలక్ష్మి రెడి చేసిన కొటేషన్ టేబుల్ పై పెట్టి ఎవరైనా వచ్చారో లేదో తెలుసుకోవడానికి ర్యాట్ ప్యాడ్ ని కూడా పెడుతుంది అది ఫోటో తీసుకుంటుంది. ఆ సంఘటన గుర్తుచేసుకొని ఈ పాటికి కొటేషన్ కొట్టేసి ఉండాలని ర్యాట్ ప్యాడ్ పెట్టిన చోట ఉందో లేదో ఫోటో చూస్తుంది. పెట్టిన చోట లేకపోయేసరికి ఎలుకలు వచ్చాయన్న మాట అని అనుకుంటుంది.

ఆ తర్వాత కానిస్టేబుల్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. మీపై ఎటాక్ జరిగింది కదా.. ఎవరిపైన అయిన డౌట్ ఉందా అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. దూరం నుండి శ్రీవల్లి వింటుంది. ఏంటి అక్క పోలీస్ లు వచ్చారని అడుగుతుంది. ఎటాక్ చేసిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమన్నానని శ్రీవల్లిని భయపెడుతుంది. ఆ తర్వాత శ్రీవల్లి వెళ్లి శ్రీలత కి చెప్తుంది. ఆ తర్వాత ఇది ఎవరో కావాలనే చేశారని రామలక్ష్మి అంటుంది. నువ్వు అన్ని ఆలోచించకు.. ఆఫీస్ కి వెళ్ళమని శ్రీలత అంటుంది. బయటకు వచ్చాక నాపై డౌట్ రాలేదు. ఆ రామలక్ష్మిని ఉంచకూడదని శ్రీలత అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి బిడ్ వెయ్యడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.