English | Telugu
Eto Vellipoyindhi Manasu : మ్యాగజైన్ ఫోటో కోసం నందిని ప్లాన్.. భర్తని ఒప్పించిన భార్య!
Updated : Aug 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -188 లో.....సందీప్, శ్రీలతలు కలిసి రామలక్ష్మి, సీతాకాంత్ లని దూరంగా ఉంచడానికి ప్లాన్ చేస్తారు. సీతాకాంత్, రామలక్ష్మిలు వస్తుండడం గమనించి యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు నిప్పుల గుండంలో నడుస్తానంటున్నావని శ్రీవల్లి, సందీప్ లు శ్రీలతని అడుగుతారు. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. ఏమైందని అడుగుతారు. మీ జాతకం జ్యోతిష్యునికి చూపించాను. అందులో ఏవో దోషాలు ఉన్నాయట.. మీరు ఇద్దరు కలిసి ఉంటే మీకు గండం ఉందట అని శ్రీలత అంటుంది. దానికి పరిహారంగా ఇది చేస్తానంటున్నానని అనగానే.. వద్దని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఏ నిప్పుల గుండంపై నడవాల్సిన అవసరం లేదు.. నువ్వు చెప్పినట్టే దూరంగా ఉంటామని సీతాకాంత్ అంటాడు.
దాంతో శ్రీలత మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. రామలక్ష్మి, సీతాకాంత్ వెళ్ళిపోయాక.. ఇలా మీకు ప్లాన్ ఉన్నట్టే నాకు ఏదోక ప్లాన్ ఉంటుంది కదా .. వెయిట్ చెయ్యండి అంటూ శ్రీలతకి సవాలు విసురుతుంది. మరొకవైపు సీతాకాంత్ కోసం నందిని చూస్తుంది. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. సీతాకాంత్ ని పలకరిస్తుంది. ఇబ్బందిగానే అతను సమాధానం చెప్తాడు. ఆ తర్వాత నందిని, రామలక్ష్మిని మీరు పిల్లల గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఇంకా లేదని రామలక్ష్మి అంటుంది. మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఇంకేంటని నందిని అనగానే.. మేమ్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. అది చెప్పి మీకు టైమ్ వేస్ట్ చెయ్యలేనని రామలక్ష్మి వెళ్లిపోతుంది. నువ్వు, సీతా పెళ్లి కోసం ఒకటయ్యారు కానీ పిల్లలు కోసం ఒకటి అవ్వరు.. సీతా మనసులో నువ్వు లేవు.. నేను ఉన్నానని నందిని అనుకుంటుంది. మరొకవైపు శ్రీలత గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. అమ్మ అలా భయపడుతుంది.. అసలు అమ్మని పట్టించుకోవడం లేదని సీతాకాంత్ అనగానే.. మీరు నన్ను కూడా పట్టించుకోవడం లేదని రామలక్ష్మి అంటుంది.
అప్పుడే వాళ్ళ దగ్గరికి నందిని వచ్చి.. నాకు కంపెనీ డెవలప్ కి మంచి ఐడియా వచ్చింది. సీతాకాంత్ నేను ఒక ఫోటో షూట్ చేసి మ్యాగజైన్ లో వస్తే కంపెనీ గురించి ఎక్కువ మందికి తెలుస్తుందని నందిని అనగానే.. మంచి ఐడియా అని రామలక్ష్మి అంటుంది. సీతాకాంత్ వద్దని అంటాడు. అయిన రామలక్ష్మి ఒప్పిస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ పక్కన ఉంటే నా గురించి ఆలోచించడానికి ఇబ్బంది పడతాడని రామలక్ష్మిని తనతో తీసుకొని వెళ్తుంది నందిని. మరొకవైపు రామలక్ష్మిపై శ్రీలత సందీప్, శ్రీవల్లి కలిసి కుట్ర చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.