English | Telugu

Guppedantha Manasu : జగతి కొడుకే మను.. క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1166 లో.. నా కన్నతల్లి ఎవరో చెప్పమని అనుపమని మను నీలదీస్తాడు. కానీ అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. నువ్వు ఇలా చెప్పావ్ అంటూ గన్ ని తన తల దగ్గర పెట్టుకొని.. ఇప్పుడు నిజం చెప్పమని అడుగుతాడు. మరొకవైపు జగతి రాసిన లెటర్ ని మహేంద్రకి ఇస్తాడు రిషి. ఆ లెటర్ చదువుతుంటాడు మహేంద్ర. జగతి ఎవరికి తెలియని కొన్ని నిజాలు అందులో చెప్తుంది.

రిషి, మహేంద్ర నన్ను క్షమించండి.. మీ దగ్గర ఒక నిజం దాచాను.. మనకి ఇద్దరు కవలలు పుట్టారు. ఒకరు రిషి.. ఇంకొకరు మను అని ఉంటుంది. నేను ఒకరిని అనుపమకి ఇచ్చాను. తను ప్రేమగా మనుని పెంచుకుంటుందని జగతి లెటర్ లో రాస్తుంది. మను మన కొడుకా అంటూ మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అనుపమ కూడా మనుకి నిజం చెప్తుంది. నువ్వు జగతి కొడుకువు.. నాకు ఇచ్చిన మాట కోసమే ఇలా చేసింది.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు.. అందుకే జగతి తన బిడ్డని ఇస్తానని అంది.. అందుకే నిన్ను ఇచ్చిందంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత మహేంద్ర ఇంకా లెటర్ చదువుతుంటాడు. శైలేంద్ర చేసిన తప్పులు గురించి చెప్తాడు. దీనంతటికి కారణం శైలేంద్ర, దేవయాని అని జగతి లెటర్ లో.. వాళ్లు చేసిన పనులు గురించి రాస్తుంది. అది చదివిన మహేంద్ర కోపంగా ఇంత చేసిన వీడిని ఎందుకు ఏమనట్లేదని రిషిని‌ మహేంద్ర అడుగుతాడు. ఆ రోజు త్వరలోనే ఉందని రిషి అంటాడు. ఈ లెటర్ చదివి.. నా వల్లే నీకు అన్యాయం చేసారని చాలా బాధపడ్డానని రిషి అంటాడు. నన్ను పెంచిన నా పెద్దమ్మ అలా చెయ్యడమేంటని రిషి బాధపడతాడు.

మరొకవైపు దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి.. వాడు రంగా కాదు రిషి అని అంటాడు. దాంతో దేవయానికి ఒక్కసారిగా చెమటలు పడుతాయి. రిషి మనల్ని వదలడని దేవయాని భయపడుతుంది. ఇక ఎవర్ని వదలనంటూ శైలేంద్ర ఆవేశపడుతాడు. మరొకవైపు రిషి, వసుధారలని గది లోపల ఉంచి బయటనుండి గడియపెడతాడు మహేంద్ర. శైలేంద్రని చంపుతానంటూ వెళ్తాడు. రిషి వసుధారలు పిలిచినా పట్టించుకోకుండా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.