English | Telugu

Eto Vellipoindi Manasu : నిఘా పెట్టిన నందిని.. అసలు ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -213 లో.....నందిని సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే హారిక వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అసలు సీతాపై ఎటాక్ జరగడమేంటి? ఇలా చూడడానికి మళ్ళీ వచ్చానా.. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారని హారికతో‌ నందిని అంటుంది. సందీప్ తనతో మాట్లాడిన సంఘటన గుర్తుచేసుకొని.. ఇదంతా సందీప్ చేస్తున్నాడని నందిని అంటుంది. నువ్వు ఎలాగైనా సందీప్ దగ్గర నుండి ఒక్క క్లూ సంపాదించమని హారికకి‌ నందిని చెప్తుంది.

మరొక వైపు డిటెక్టివ్ సీతకాంత్ కి ఫోన్ చేసి.. నందిని టీ తాగి ఆఫీస్ కి వెళ్ళిందంటూ చెప్తాడు. అసలు నువ్వు అవి చెప్తున్నావేంటి? నువ్వు డిటెక్టివ్ ఏనా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళు అందరు భోజనం చేస్తుంటే నేను వడ్డిస్తానని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మాణిక్యం మటన్ కర్రీ తీసుకొని వస్తాడు. అల్లుడు నువ్వు ఇది తినాలి నేనే వడ్డిస్తానని అందరికి వడ్డీస్తాడు. అందులో మటన్ బొక్కలు ఎలా తినాలో సీతాకంత్ కి‌ మాణిక్యం చూపిస్తాడు. శ్రీవల్లితో సహా అందరూ తింటుంటే శ్రీలత కోపంగా వెళ్తుంది. మరొకవైపు సందీప్ ఆఫీస్ లో ఉండగా.. సందీప్ దగ్గరికి హారిక వెళ్లి ఫైల్ పై సంతకం చెయ్యండి అని సందీప్ ని ఇంప్రెస్స్ చేసేలా మాట్లాడుతుంది. సందీప్ ని మాటలో పెళ్లి తన టేబుల్ కింద ఒక బ్లూ టూత్ కనెక్ట్ చేసి పెడుతుంది. ఆ తర్వాత గట్టిగ ట్రై చేస్తే తను నాకు పడేలా ఉందని సందీప్ అనుకుంటాడు.

ఆ తర్వాత నందిని బయటకు వచ్చి సందీప్ టేబుల్ కింద బ్లూటూత్ పెట్టాను.. తనేం మాట్లాడినా నీకు తెలిసేలా కనెక్ట్ చేసానని హరిక చెప్పగానే.. థాంక్స్ అని నందిని చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి మాణిక్యం వచ్చి.. ఏం అయిందని అలా ఉన్నావని అడుగుతాడు.‌ ఏం కాకూడదనే భయపడుతున్నాను.. ఇంటి దొంగని ఈశ్వరడైనా కనిపెట్టలేడని రామలక్ష్మి అంటుంది. సాక్ష్యం లేకుండా ఆరోపిస్తే సీతా గారి దృష్టిలో బ్యాడ్ అవుతాను.. అలా అని సైలెంట్ గా ఉంటే మళ్ళీ తనపై ఎటాక్ జరుగుతుందేమో భయంగా ఉందని రామలక్ష్మి అనగానే.. నీ భయంలో అర్థం ఉంది అని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.