English | Telugu
జ్యోతిష్కుడి పేరుతో అత్తకి చుక్కలు చూపించిన కోడలు!
Updated : Sep 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -190 లో.....అందరు భోజనం చేస్తూ ధన గురించి మాట్లాడుకుంటారు. అక్కడ పర్మిషన్ రాగానే వచ్చేస్తానన్నాడు అని సిరి అంటుంది. వాడి ఆలోచన మొత్తం మీ దృష్టిలో మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాలని ఉందని రామలక్ష్మి అంటుంది. తనకి ఏ సపోర్ట్ కావాలన్న చేస్తానని సీతాకాంత్ అంటాడు. అల్లుడికి మాత్రం అన్ని చేస్తారు. ఇక్కడ తమ్ముడికి ఏం చెయ్యరు. ఆఫీస్ లో పనివాడిగా ఉంటున్నారు.. అల్లుడు ఓనర్ అయిపోతున్నాడని శ్రీవల్లి అనగానే.. ఇప్పుడు మీ అయనకి ఎక్కడ విలువ తక్కువైందని పెద్దాయన అంటాడు.
నోరు మూసుకొని తినమని శ్రీలత శ్రీవల్లిపై కోప్పడుతుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు.. తక్కువ కాదని సీతాకాంత్ అంటాడు. నన్ను మా ఆయనని దూరం చేస్తావా.. నీ సంగతి చెప్తానని రామలక్ష్మి అనుకుంటుంది. అత్తయ్య మీరు తినకూడదు మర్చిపోయారా.. ఉపవాసం ఉంటానని ఇందాక మమ్మల్ని దూరంగా ఉండమని జ్యోతిష్యడితో మీరు మాట్లాడడం నేను విన్నానని రామలక్ష్మి అంటుంది. అలా శ్రీలతని ఇరికిస్తుంది రామలక్ష్మి. కావాలంటే నెంబర్ ఇవ్వండి అడుగుతానని రామలక్ష్మి అనగానే.. అసలు జ్యోతిష్యుడే లేడు ఇప్పుడెలా అంటూ.. అవసరం లేదమ్మా గుర్తొచ్చింది తినను అంటుంది. ఇవన్నీ ఛాదస్తమని సీతాకాంత్ అనగానే.. అలా అయితే మనం దూరంగా ఉండడం కూడా ఛాదస్తమవుతుందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత మీరు కటిక నేలపై పడుకుంటానని కూడా అన్నారని రామలక్ష్మి చెప్తుంది. శ్రీలత ఏం చెయ్యలేక అవునని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి శ్రీలత కోసం పాలు తీసుకొని వస్తుంది. తనకి ఇవ్వకుండా తనే పాలు తాగుతుంది. అప్పుడే శ్రీవల్లి పాలు తీసుకొని వస్తుంది. దాంతో శ్రీలత హ్యాపీగా ఫీల్ అవుతుంది. రామలక్ష్మి చేతిలో గ్లాస్ చూసి.. అత్తయ్య ఆల్రెడీ తాగేసారా అంటు తెచ్చిన పాలు శ్రీవల్లి తాగుతుంది.
ఆ తర్వాత మీరు కిందపడుకోండి.. నేను పైన పడుకుంటానని రామలక్ష్మి అనగానే.. నువ్వే కిందపడుకోమని శ్రీలత కోప్పడుతుంది. ఇదంతా ఛాదస్తం అయితే.. నేను మా అయనకి దూరంగా ఉండడం ఎందుకని వెళ్తుంటే.. వద్దు కింద పడుకుంటానని శ్రీలత అంటుంది. శ్రీలత కింద పడుకుంటుంది. రామలక్ష్మి కావాలనే ఏసీ పెంచుతుంది. శ్రీలత చలికి వణుకుతుంది. మరొకవైపు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. రామలక్ష్మి పక్కన ఉన్నట్టు ఉహించుకొని మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.