English | Telugu
వసుధారని ఇంటికి తీసుకొచ్చిన రంగ.. షాక్ లో సరోజ...
Updated : Jul 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1126 లో.. రంగా మళ్ళీ వసుధారని తీసుకొని వస్తాడు. దాంతో మళ్ళీ ఎందుకు దీన్ని తీసుకొని వచ్చావంటూ సరోజ కోప్పడుతుంది. వసుధార చీర కట్టుకొని వస్తుంటే.. మేడమ్ మీకు ఈ చీర బాగుందని రంగా చెప్తాడు. ఈ చీర ప్రొద్దున సరోజనే ఇచ్చిందని వసుధార చెప్తుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావని వసుధారని సరోజ అడుగుతుంది. రిషి సర్ తీసుకొని వచ్చాడు. అయినా నేనేం వట్టిగనే రాలేదు.. పైన పెంట్ హౌస్ ఉంది కదా అందులోకి రెంట్ కి వచ్చానని వసుధార అంటుంది. అదేంటి రెంట్ ఎందుకని సరోజ అంటుంది. మాకు డబ్బులు కావాలి మీ నాన్నకి అప్పు కట్టాలి కదా అని రంగా అనగానే.. మా నాన్నకి చెప్పి అప్పు కట్టడం వద్దని చెప్తానని సరోజ అంటుంది. నేను ఉండమని మాటిచ్చాను సరోజ అని రంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సరోజ వసుధారతో కాసేపు వాదిస్తుంది.
మరొకవైపు అనుపమ బాధపడుతూ.. తన పెద్దమ్మ దగ్గరకి వస్తుంది. అనుపమ తనని దేవయాని బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం చెప్తుంది. ఇన్నిరోజులు ఆ నిజం ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడ్డాను.. ఎన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినా నిజం చెప్పలేదు.. ఇప్పుడు ఇలా తను బ్లాక్ మెయిల్ చేస్తుంది. నేను మను వాళ్లకు దూరంగా ఉంటానని అనుపమ అంటుంది. అప్పుడే మహేంద్ర ఫోన్ చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగగా.. బయటకు వచ్చాను. అది నీకు అనవసరం అంటూ మహేంద్రతో అనుపమ కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే మహేంద్ర దగ్గరకి మను వస్తాడు. మీ అమ్మ ఎక్కడికి వెళ్లిందో అర్ధం కావడం లేదని అనగానే.. మను వాళ్ళ గ్రానీకి ఫోన్ చేస్తాడు. దాంతో అనుపమ ఇక్కడే ఉందని తను చెప్తుంది. మహేంద్రతో మాట్లాడి నువ్వు త్వరగా ఇక్కడికిరా అని మనుతో గ్రానీ చెప్తుంది.
మరొకవైపు వసుధార ట్యూషన్ చెప్తుంది. ఊళ్ళో పిల్లలు అందరిని వసుధార దగ్గర కి తీసుకొని వస్తారు. ఈ ఊళ్ళో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీరు చేస్తున్నారు మా పిల్లలని మీ చేతిలో పెడుతున్నామని వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇది ఊళ్ళో వాళ్ళ దృష్టిలో మంచిది అయిందని సరోజ కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరకి మను వస్తాడు. ఇక నుండి మనం ఇక్కడే ఉందామని అనుపమ అనగానే.. మను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.