English | Telugu
'ఎక్స్‌ట్రా జబర్దస్త్' స్టేజ్‌పై ఇమ్మానియేల్ లవ్ ప్రపోజల్!
Updated : Feb 6, 2021
ఈటీవీలో 'జబర్దస్త్' తరువాత అంతగా పాపులర్ అయిన షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో'. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా రోజా, మనో వ్యవహరిస్తున్నారు. రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో వర్షని స్టేజ్‌పైనే ఇమ్మానియేల్ ప్రపోజ్ చేయడం అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా చేతిలో ఒకసారి రెడ్ కలర్ హార్ట్ సింబల్ బెలూన్‌ని పట్టుకుని, ఇంకోసారి చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఇమ్మానియేల్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసిన తీరు వైరల్‌గా మారింది.
ఈ దృశ్యం చూసి రోజా అవాక్కయింది. ఫిబ్రవరి 12న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వర్ష కూడా సిగ్గుల మొగ్గవుతూ ఇమ్మానియేల్ ఇచ్చిన రోజా పువ్వుని అందుకోవడం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ భావోద్వేగానికి లోనయ్యాడు. చాలా మంది అమ్మాయిలు తన పక్కన నించోవడానికే ఇష్టపడలేదని, అలాంటిది వర్ష మాత్రం తనతో సన్నిహితంగా వుందనీ ఎమోషనల్ అయ్యాడు.
వర్ష 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి ఇమ్మానియేల్ తో సన్నిహితంగా వుంటోంది. వీరిద్దరిపై గత కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశం జరగడం, ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రీకరించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో జడ్జెస్ సాక్షిగా ఇమ్మానియేల్ .. వర్షకు ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఫిబ్రవరి 12న ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నది.