English | Telugu

ముసుగు తీసేసిన కావ్య.. దుగ్గిరాల ఫ్యామిలీకి నిజం తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-35 లో.. స్వప్నని తీసుకొస్తుందని అప్పు కోసం కనకం ఎదురుచూస్తుంటుంది. మరోవైపు పెళ్ళితంతు జరుగుతుంది. తాళికట్టే సమయానికి స్వప్న వస్తుందో రాదో అన్న భయంతో కావ్య ఉంటుంది.

మరోవైపు స్వప్న, రాహుల్ ఉన్న కార్ ని అప్పు వెంబడించడంతో.. తొందరగా వెళ్ళు అప్పు వస్తుందని రాహుల్ తో స్వప్న అంటుంది. ఇప్పుడు వాళ్ళు రాకుండా ఆపాలి అంతే కదా అని చెప్పి రాహుల్.. కార్ సడన్ బ్రేక్ వేసేసరికి వాళ్ళ వెనకాలే వస్తున్న అప్పు బండి కార్ కి తగిలి కిందపడిపోతుంది. దీంతో అప్పుకి దెబ్బలు తగులుతాయి. రాహుల్, స్వప్న లు ఒక హోటల్ కి వెళ్ళి రిలాక్స్ అవుతారు. "ఎక్కడ రాజ్ తో నా పెళ్ళి అవుతుందోనని బయపడిపోయాను. ఇలా మనిద్దరం ఒక గదిలో ఉంటే నాకు ధైర్యంగా ఉంది" అని స్వప్న అంటుంది. అదే సమయానికి రాహుల్ కి రాజ్ వాళ్ళ బాబాయ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి.."ఆఫీస్ లో ఫైర్ అయిందని వెళ్ళావ్ కదా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది" అని అడుగుతాడు. "మామయ్య ఆఫీస్ లో అంతా ఓకే నేను చూసుకుంటున్నా" అని అబద్దం చెప్తాడు రాహుల్. మరోవైపు దెబ్బలతో వచ్చిన అప్పుని చూసి కనకం ఏడుస్తుంది. "నా గుండెల మీద తన్ని వెళ్ళిన స్వప్న గురించి ఏడవాలా.. దెబ్బలతో వచ్చిన నిన్ను చూసి ఏడవాలా.. నా మాట కాదనకుండకుండా పీటల మీద కూర్చున్న కావ్య గురించి ఏడవాలా" అని అనుకుంటూ కనకం బోరున ఏడుస్తుంది.

ఆ తర్వాత కావ్య మెడలో తాళి కడుతుండగా.. రాజ్ చెయ్యి పట్టుకొని కావ్య ఆపి తన ముసుగు తీస్తుంది. స్వప్న కాకుండా కావ్య ఉండడంతో.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ అని అనగానే "స్వప్న వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కూడా నా కూతురే" అని కనకం అంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి.. "మమ్మల్ని ఇలా మోసం చేస్తావా" అంటూ కనకంపై విరుచుకుపడతారు. రాజ్, కావ్యని పెళ్ళి చేసుకుంటాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.