English | Telugu
చైనాలో ఫేమస్ పాట పాడి అలరించిన నవ్యస్వామి
Updated : Aug 21, 2023
శ్రావణమాసం వచ్చిందంటే చాలు బుల్లితెర మీద ఆ పాజిటివ్ వైబ్స్, స్పెషల్ ఈవెంట్స్ కి లెక్కేలేదు. ఎందుకంటే ఈ మాసం అంతా పండగలే పండగలు కాబట్టి. ఇప్పుడు డ్రామా జూనియర్స్ 6 లో శ్రావణ మాసం కళకళలాడింది. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "బెదురులంక" మూవీ టీమ్ "కార్తికేయ - నేహశెట్టి" ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఐశ్వర్య, అంజనా, నవ్య స్వామితో పాటు జడ్జెస్ శ్రీదేవి , జయప్రద, బాబుమోహన్ వచ్చి ఆడియన్స్ కి శ్రావణమాస శుభాకాంక్షలు చెప్పారు. ఇక యాంకర్ ప్రదీప్ జోక్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు కదా " జయప్రద గారు మీరేమి కోరుకున్నారు" అని అడిగేసరికి "ప్రదీప్ గురించే కోరుకున్నా" అన్న ఆమె మాటకు వచ్చిన ఫన్నీ కన్నీళ్లను తుడుచుకుని జోక్స్ వేసాడు. "నా గురించి కూడా కోరుకునే వాళ్లున్నారా అమ్మా" అని కౌంటర్ వేసాడు.
"శ్రీదేవి గారు మీకు శ్రావణ మాసం అంటే ఏం గుర్తొస్తుంది" అని ప్రదీప్ అడిగేసరికి. "హజ్బెండ్స్ వచ్చి హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం" అనేసరికి "364 రోజులు భర్తలను పీక్కుతినేసి.. ఈ ఒక్కరోజు మాత్రం వాళ్ళు బాగుండాలని కోరుకోవడం బాగుంది" అని కౌంటర్ వేసాడు ప్రదీప్. "ఆవిడని చూడండి చాల పద్దతిగా రెడీ అయ్యి వచ్చారో ఎప్పుడూ లేనిది " అని నవ్యస్వామిని చూపిస్తూ ప్రదీప్ అనేసరికి "పద్దతి అంటే నవ్య. నవ్య అంటే పద్దతి" అని నవ్యస్వామి కూడా కౌంటర్ వేసింది. "జోక్ అంటే ఇది..ఇదే జోక్ అంటే" అని ప్రదీప్ కూడా రివర్స్ కౌంటర్ వేసాడు. "నేను ఐశ్వర్య రాయ్ కావాలనుకుంటున్నాను.. ఎలాగో తెలీడం లేదు " అని ఐశ్వర్య పిస్సే ప్రదీప్ ని అడిగింది "మీ పేరులో ఇలాగే ఐశ్వర్య ఉంది కాబట్టి చేతిలో ఒక రాయి పట్టుకుని తిరుగు" అని సలహా ఇచ్చాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఈ బుల్లితెర హీరోయిన్స్ తో స్కిట్స్ వేశారు. భార్య భర్తల సంబంధం గురించి ఒక చైనా కవి ఏమన్నాడో తెలుసా అని నవ్యస్వామి తన భర్తను అడిగి చైనాలో ట్రెండింగ్ లో ఉన్న పాటను పాడి అందరిని నవ్వించింది. పెళ్ళైన వాళ్లంతా ఈ స్కిట్స్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అని బెదురులంక మూవీ హీరోహీరోయిన్స్ కార్తికేయ-నేహ అన్నారు. ఇక లాస్ట్ లో చిన్నారులంతా అష్ట లక్ష్ములుగా రావడం నిజంగా ఈ షో మొత్తానికి హైలైట్ గా నిలిచింది.