English | Telugu
పెళ్లయ్యాక ఇలా అరుస్తూ మాట్లాడితే ఎలా సంసారం చేసేది అన్న రిషి సర్
Updated : Jun 21, 2023
ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫేర్ వెల్ ఎపిసోడ్ బాగా నవ్వించింది. మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్ నటులు, సాయంత్రం ప్రసారమయ్యే సీరియల్ నటులు వచ్చారు. ఇక రిషి సర్ అలియాస్ ముకేష్ గౌడ వచ్చాడు. ఇక వీళ్ళను చూడడానికి వచ్చిన ఆడియన్స్ నుంచి లేడీ ప్రెసిడెంట్ ఫైమా మాట్లాడడానికి వచ్చిందంటూ శ్రీముఖి చెప్పేసరికి ఫైమా గట్టిగా అరుచుకుంటూ వచ్చింది. దాంతో రిషి సర్ భయపడిపోయాడు. ఇంతలో ఫైమా వచ్చి "అందరూ అడుగుతున్నారు బావా నువ్వు ఎలాంటివి అమ్మాయిని చేసుకుంటావు అని ..ఫైమాలా హైట్, వెయిట్ ఉన్న అమ్మయిని చేసుకుంటావా.
అసలు ఫైమానే చేసుకుంటావా అనే డౌట్స్ సోషల్ మీడియాలో చాల మందికి ఉన్నాయి." అని అడిగేసరికి " ఎలాంటి అమ్మాయిని అయినా పెళ్లి చేసుకుంటాను కానీ మీలాంటి అమ్మాయి పెళ్లి చేసుకోను..పెళ్లయ్యాక ఇలా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఎలా సంసారం చేసేది" అని కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి వచ్చి రిష్ సర్ తో కలిసి స్టేజి మీద రాంప్ వాక్ చేసింది. మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని కోమలి అనే అమ్మాయి అడిగేసరికి శ్రీముఖి అదే ప్రశ్నను రిపీట్ చేసింది. గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది శ్రీముఖి. "గర్ల్ ఫ్రెండ్ లేదు" అని చెప్పాడు. "ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అమ్మాయిని ఇష్టపడతారు" అని శ్రీముఖి అడిగేసరికి ఆమె వైపుకు ఒక లుక్ ఇచ్చాడు రిషి సర్. "క్వాలిటీస్ ఉన్న వాళ్ళే ఇలా అడిగితే ఎలా చెప్పాలి..ఐనా పక్కనే శ్రీముఖి ఉంది కాబట్టి బాగా మ్యాచ్ అవుతుంది అని" చెప్పాడు రిషి సర్. "కోమలి చూడు మా జంట బాగుందా" అని అడిగేసరికి "బాగుంది" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. గుప్పెడంత మనసు సీరియల్ తో రిషి సర్ గా ఎంతో మంది మనసుల్ని కొల్లగొట్టాడు ముకేష్. అతనికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.
