English | Telugu

'వరూనిధి పరిణయం' ఫేమ్ చందన సేగు బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

వరూనిధిగా తెలుగు ప్రజలకు దగ్గరైన కన్నడ కస్తూరి చందన సేగు. 2013 నుండి 2016 వరకూ సుమారు 850కి పైగా ఎపిసోడ్స్ నడిచిన 'వరూనిధి పరిణయం'తో ఆమెకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అసలు చందన నటి కావాలని అనుకోలేదు. చిన్నతనంలో గాయని కావాలని అనుకుంది. మరి, నటనలోకి ఎలా వచ్చింది? యాంకరింగ్ ఎందుకు చేసింది? డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏమిటి? చందన సేగు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? ఆమె రియల్ లైఫ్ సంగతులు తెలుసుకుందాం...

- చందన సేగు తల్లి సరస్వతీ గుప్తా డబ్బింగ్ ఆర్టిస్ట్. చిన్నతనంలో తల్లితో కలిసి డబ్బింగ్ స్టూడియోలకు వెళ్లడం ఆమెకు అలవాటు అయ్యింది. అక్కడ ఒకరికి ఆమె గొంతు నచ్చింది. దాంతో ఆమెతో డబ్బింగ్ చెప్పించారు. అలా డబ్బింగ్ కెరీర్ మొదలైంది. ఒక యాక్సిడెంట్ కావడంతో సరస్వతీ గుప్తా డబ్బింగ్ చెప్పడం మానేసినా చందన సేగు కంటిన్యూ చేసింది. సుమారు 45 సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.

- డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలని చందన ఎప్పుడూ అనుకోలేదు. చిన్నతనంలో గాయని కావాలని అనుకుంది. తల్లి దగ్గర కర్ణాటక సంగీతంలో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని పాటలు కూడా పాడింది. గొంతు బావుందని, పాటలు బాగా పాడుతుందని ఆమెతో డబ్బింగ్ చెప్పించారు. తర్వాత స్నేహితులు 'చూపులకు బాగుంటావ్. యాక్ట్ చేయవచ్చు కదా' అనడంతో నటి కావాలనే కోరిక ఆమెలో మొదలైంది. తండ్రి స్టేజి ఆర్టిస్ట్ కావడంతో ఆయనకూ నటన అంటే ఆసక్తి. కుమార్తెను ఎంకరేజ్ చేశారు. ఒక టీవీ ఛానల్ వాళ్లు అవకాశం ఇవ్వడంతో యాంకరింగ్ చేసింది.

- యాకరింగ్ చేస్తున్నప్పుడే కన్నడ సీరియల్‌లో చిన్న పాత్ర చేసే అవకాశం రావడంతో అందులో నటించింది. మరో సీరియల్ కూడా చేసింది. అలా స్కూల్ డేస్ లో సీరియల్ ప్రయాణం ప్రారంభమైంది. వరుసగా చిన్న చిన్న రోల్స్ రావడంతో ఇంటర్ చదివేటప్పుడు బ్రేక్ తీసుకుంది. తర్వాత 'నేను బేవర్సీ గొత్తా' షార్ట్ ఫిల్మ్ చేసింది. దాని తర్వాతే 'వరూనిధి పరిణయం' సీరియల్ టీమ్ నుండి ఆమెకు పిలుపు వచ్చింది.

- 'వరూనిధి పరిణయం' తర్వాత వోకల్ కార్డ్ దెబ్బతినడంతో డబ్బింగ్ చెప్పడం, పాటలు పాడటం మానేసింది.

- ప్రస్తుతం 'స్వర్ణ ప్యాలెస్' సీరియల్‌లో చందన నటిస్తోంది. కన్నడలో 'రమేష్ - సురేష్' అనే సినిమా చేస్తోంది. మరో సినిమా కూడా ఆమె చేతిలో ఉంది. తెలుగులో సినిమా అవకాశాలు వచ్చాయట. అయితే, కథతో పాటు పాత్రలు నచ్చక వదులుకుందట. ఆమెకు ఇష్టమైన హీరోయిన్ ప్రియాంకా చోప్రా.

- చందన సేగు ఫ్యాషన్ డిజైనర్ కూడా! ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ఆమె డ్రస్సులు అన్నీ ఆమే డిజైన్ చేసుకుంటుంది. ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనేది ఆమె కోరిక. అలాగే, ఆమె యానిమల్ లవర్. ఐదేళ్లుగా యానిమల్ రెస్క్యూ టీమ్ లో పని చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.