Read more!

English | Telugu

ఫుల్ మీల్ కామెడీ ఈవెంట్  ధూమ్ ధామ్ దసరా

 

బుల్లితెర మీద దసరా సంబరాలు మొదలైపోయాయి. రకరకాల ఈవెంట్స్ ని అప్పుడే మొదలు పెట్టేసారు. వాటి ప్రోమోస్ ని కూడా నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ధూమ్ ధామ్ దసరా స్పెషల్ ఈవెంట్ పేరుతో ఈటీవీలో త్వరలో ఒక కార్యక్రమం జరగబోతోంది.

దానికి సంబందించిన ప్రోమో చూస్తే చాలు ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఆడియన్స్ కూడా ఈ షో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ షోకి రాఘవ లారెన్స్, నవీన్ చంద్ర, ఎస్జె. సూర్య రాబోతున్నారు. ఇక అదనపు ఆకర్షణగా బాబా సైగల్ మ్యూజిక్ కూడా ఉండబోతోంది. ఇక కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు.

అంతే కాదు డబ్బు ఊరికే రాదు అంటూ తనకంటూ ఒక టాగ్ లైన్ క్రియేట్ చేసుకుని ఎలాంటి స్టార్స్ తో తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోకుండా తనకు తానే ప్రమోట్ చేసుకుని ఒక రికార్డు క్రియేట్ చేసిన .. అందరం ముద్దుగా పిలుచుకునే లలిత జువెలర్స్  గుండు అంకుల్ , సిరి హన్మంత్ వీళ్ళతో పాటు హోస్ట్ రవి అందరితో డైలాగ్స్ చెప్పించి గేమ్స్ కూడా ఆడించాడు. అలాగే బుల్లితెర నటీనటులంతా ఫుల్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఇక రాఘవ లారెన్స్ చేసిన డాన్స్ స్టెప్, సూర్య చెప్పిన స్పీడ్ డైలాగ్ అని పడీపడీ నవ్వారు. చెప్పాలంటే ఈ షో ఆడియన్స్ దసరా టైములో ఫుల్ మీల్ కామెడీగా ఉండబోతోంది తెలుస్తోంది. "ధూమ్ ధామ్ దసరా  ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మీకు తెలిసిపోయిందా" అంటూ రాఘవ లారెన్స్ ఫైనల్ టచ్ ఇచ్చారు.