English | Telugu

ఆవకాయ్ పచ్చడితో గోరు ముద్దలు తినిపించిన గంగవ్వ

"ఢీ సీజన్ 16 " గ్రాండ్ గా బుధవారం లాంఛ్ కాబోతోంది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తూ ఉంటామో ఇప్పుడు బుల్లితెర మీద డీపీఎల్ కూడా అలాగే చూడబోతున్నాం. ఢీ న్యూ సీజన్ కి ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. అదే డిపిఎల్ దీని ప్రోమో చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ ఇందులో కనిపించారు. ప్రదీప్, ఆది, దీపికా పిల్లి, శేఖర్ మాష్టర్, పూర్ణ, గంగవ్వ, విజె సన్నీ కనిపించారు. ఈ లాంఛింగ్ ఎపిసోడ్ కి వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చారు. అభి మాష్టర్ టీంకి బెజవాడ టైగర్స్ అని, గ్రీష్మ మాష్టర్ టీంకి హైదరాబాద్ ఉస్తాద్స్ అని, ఐశ్వర్య మాష్టర్ టీంకి నెల్లూరు నెరజాణలు, కన్నా మాష్టర్ టీంకి ఓరుగల్లు వీరులు అనే టైటిల్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

హైపర్ ఆది, విజె సన్నీ వచ్చి పెళ్లి చేసుకోవచ్చా లేదా ? కొన్ని టిప్స్ చెప్పండి అని వరుణ్ సందేశ్ ని అడిగారు "పెళ్లి చేసుకోండి..అదిరిపోతోంది" అని చెప్పాడు..."చెప్తుంటేనే చెమటలు పడుతున్నాయి" అని కౌంటర్ వేసాడు ఆది. "మాష్టర్ పెళ్లి చేసుకోవాలా వద్దా"అని సన్నీ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి "ఆయనకు పెళ్లి చేసుకున్నా పెద్దగా బాధేమీ లేదు..ఆయన ఇంటి ఫుడ్డు, హోటల్ ఫుడ్డు రెండు బానే తింటాడు" అని ఆన్సర్ చేసాడు ఆది. ఇంతలో గంగవ్వ ఆవకాయ అన్నం తీసుకుని స్టేజి మీదకు వచ్చింది.."ఆది తెలుసా నీకు.." అని ప్రదీప్ అడిగాడు.."ఆది తెలుసు...పంచులు వేస్తాడు బాగా..కానీ నాకు సరిగా వినిపించవు" అని చెప్పింది. ఇక గిన్నెలోంచి ఆవకాయ అన్నం మొత్తాన్ని గోరు ముద్దలు చేసి స్టేజి మీద ఉన్న అందరికీ తినిపించింది. "మాకు ఆకలేస్తుంది గంగవ్వా అని చెప్పి శేఖర్ మాష్టర్ కూడా తిన్నారు. చాలా రోజుల తర్వాత ఆవకాయ అన్నం తిన్నాం నీ చేత్తో...మా అమ్మ పెట్టినట్టే ఉంది" అంటూ గంగవ్వ కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.