English | Telugu
700 కే సెలబ్రిటీ అవ్వొచ్చా నాకొద్దు
Updated : Jun 20, 2023
ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ విషయంలో రోజుకొకరుగా వెరైటీగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు అలీ రెజా తన మిత్రుడు శేఖర్ హుస్సేన్ తో కలిసి కార్ లో ట్రావెల్ చేస్తూ బ్లూ టిక్ గురించి చిన్నపాటి డిస్కషన్ చేశారు. "అరేయ్ శేఖర్ ఇన్స్టాగ్రామ్ లో మన పేరు పక్కన బ్లూ టిక్ ఉంటుంది కదా అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అందరికీ ఇస్తోంది. నీకు కావాలా ..తీసుకో..ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ అవ్వొచ్చు .. ఐపోతావా ...కానీ అది 700 లు ప్రతీ నెలా కట్టాలంటా..డబ్బులు కట్టేసి సెలబ్రిటీ ఐపో నువ్వు కూడా..ఇపోరా.. చెప్పుకోవచ్చు కదరా నేను కూడా సెలబ్రిటీ అని.." అని అలీ రెజా అనేసరికి " హా నాకు కూడా కావాలి ..నేను కూడా సెలబ్రిటీ ఐపోతాను..ప్రతీ నెలా కట్టాలంటే కట్టలేను. డబ్బులు కట్టి సెలబ్రిటీ కావడం నాకెందుకు..నాకొద్దు.
డబ్బులు కడితే వచ్చే సెలబ్రిటీనా హోదా ఏం చేసుకోవడానికి ..700 కె సెలబ్రిటీ ఐపోవచ్చు అంటే చాలా మంది వస్తారు.. ప్రతీ నెలా ఈఏంఐలా డబ్బులు కట్టాలన్నమాట.. 700 లు అని అనుకుంటాం కానీ అవి కట్టేటప్పుడు తెలుస్తుంది...ఒకవేళ మన దగ్గర పైసలు లేనప్పుడు తెలుస్తుంది..అప్పుడు బ్లూ టిక్ తీసేస్తాడు... బ్లూ టిక్ ఎక్కడికి పోయింది అని వెతుక్కున్నప్పుడు అర్ధమవుతుంది 700 లు కట్టలేదు కదా అందుకే తీసేశారని తెలుస్తుంది. లింక్ మంచిగా పెట్టాడు కదా. ఇన్స్టాగ్రామ్ కి బోల్డు పైసలు వస్తాయి. " అన్నాడు శేఖర్ హుస్సేన్.
బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా కనిపించాడు అలీ రెజా. తెలుగులో అలీ రెజా కొన్ని మూవీస్ లో హీరోగా నటించడమే కాక కొన్ని సీరియల్స్ కూడా కనిపించాడు. హీరోగా చేసిన సినిమాలు కూడా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు కానీ 'ధ్రువ' మూవీలో హీరో రామ్ చరణ్ స్నేహితుల్లో ఒకరిగా నటించడం ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'వైల్డ్ డాగ్' లో కనిపించాడు.